newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

నారాయణ ధిక్కారం.. బాబు అయోమయం

28-06-201928-06-2019 12:40:00 IST
2019-06-28T07:10:00.459Z28-06-2019 2019-06-28T07:09:58.449Z - - 26-08-2019

నారాయణ ధిక్కారం.. బాబు అయోమయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు ఆయ‌న ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్పాటైన చంద్రబాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న చెప్పిందే వేదం. చంద్ర‌బాబు  త‌ర్వాత తానే అన్న రీతిలో పాల‌న‌లో ప‌ట్టు బిగించారు. కానీ మొన్నటి ఎన్నిక‌ల ఫ‌లితాల‌ త‌ర్వాత చంద్రబాబుతో మాట‌లు బంద్ చేశార‌ట‌. ఓట‌మి మీద విశ్లేష‌ణ‌, పార్టీ బ‌లోపేతం మీద చ‌ర్చిద్దామ‌ని చంద్రబాబు క‌బురు పెట్టినా ఆయ‌న‌తో ట‌చ్ మీ నాట్ అన్న రీతిలో ఉన్నార‌ట‌. 

ఇక కార్య‌క‌ర్త‌లు, ప‌లువుర మాజీ మంత్రులు, టీడీపీ పెద్ద‌ల‌కు ఏమాత్రం అందుబాటులో లేర‌ట‌. ఇప్పుడు పార్టీ మారడం మీద ఆలోచిస్తున్న ఆయ‌న‌, ఓ మ‌ధ్య‌వ‌ర్తి ద్వారా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెల్సినా ఏం చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ట‌.

ఇంతకీ ఆ నేత ఎవరంటే మాజీ మంత్రి నారాయ‌ణ‌. చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో కీల‌కమైన పుర‌పాల‌క శాఖా మంత్రిగా ప‌నిచేసిన నారాయ‌ణ‌, నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించారు. అప్ప‌ట్లో నెల్లూరు జిల్లాకు చెందిన‌ ప‌లువ‌రు వైసీపీ నేత‌ల‌ను టీడీపీలో చేరేలా ప్రోత్స‌హించారు. 

ఇక చంద్రబాబు పాల‌న‌లో రాజ‌ధాని వ్యవ‌హారాలు, సీఆర్డీఏ ప‌నులు ఇలా ప్రతి ఒక్కటీ నారాయ‌ణ ఆధ్వర్యంలో న‌డిచాయి. చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్తే క‌చ్చితంగా ఆయ‌న వెంట నారాయ‌ణ కూడా ఉండేవారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు మొత్తం ఆయ‌న చెప్పిన‌ట్లుగానే, టిక్కెట్ పంపిణీ విష‌యంలో కూడా ఆయ‌న హ‌వానే న‌డిచింది. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్నా, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నారాయ‌ణ మాటే చెల్లింది. మొత్తానికి చంద్ర‌బాబు హ‌యాంలో ఒన్ మ్యాన్ షో త‌ర‌హాలా రాజ‌కీయం న‌డిపిన నారాయ‌ణ‌, మొన్న‌టి ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వం ఎదుర్కొన్నారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా ఓడిపోయారు. 

అప్ప‌టి నుంచి నారాయ‌ణ ఎక్క‌డ ఉన్నారో పార్టీ నాయ‌కుల‌కు తెలియ‌డం లేదు. ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్ప‌టి దాకా మీడియా ముందుకు రాలేదు నారాయ‌ణ‌. క‌నీసం పార్టీ స‌మావేశాల్లో కూడా పాల్గొన‌డం లేదు. చంద్ర‌బాబు క‌బురు పెట్టినా ప‌నుల పేరుతో త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ట‌. ఇదే ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా మ‌రో వార్త తెర మీద‌కు వ‌చ్చింది. పొలిటిక‌ల్ కెరీర్ మీద అంత‌గా ఇంట్రస్ట్ చూపించ‌ని నారాయ‌ణ‌, ఇప్పుడు త‌న వ్యాపారాలు, ఆస్తులు కాపాడునే పనిలో ఉన్నార‌ట‌. 

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ రకంగా ఇరికిస్తార‌న్న భ‌యం ఆయ‌న‌కు ప‌ట్టుకుంద‌ట‌. ఎందుకంటే త‌న ఆర్థిక మూలాలైన విద్యా సంస్థ‌ల మీద జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌న్న‌ది నారాయ‌ణ భయం.

అందుకే బ‌ల‌మైన మ‌ద్దతు కోసం ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ట‌. ఇదే స‌మ‌యంలో ఆయ‌న సన్నిహితుడు బీజేపీలో చేరితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. మొద‌ట్లో వైసీపీలోకి వెళ్లాల‌ని భావించిన నారాయ‌ణ‌, జ‌నం నుంచి వ్య‌తిరేక‌త వస్తుంద‌ని భావించిన ఆయ‌న జంకార‌ట‌. అంతేకాదు, నారాయ‌ణ మీద గెలిచిన మంత్రి అనీల్, నెల్లూరుకు చెందిన ఏ ఒక్క టీడీపీ నేత‌ను వైసీపీలోకి రానీయ‌డం లేద‌ట‌. 

ఒక‌వేళ వైసీపీలోకి వెళ్ల‌డం కుద‌ర‌క‌పోతే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో రాజీ ప‌డ‌దామ‌ని భావించినా, అది కూడా కుద‌రడం లేద‌ట‌. అందుకే ఇప్పుడు బీజేపీలో చేరితే బాగుంటుంద‌న్న‌ది నారాయ‌ణ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. త‌న స‌న్నిహితుడితో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు త‌న ఉద్దేశంతో ఏంటో చెప్పించార‌ట‌. అయితే బీజేపీ పెద్ద‌ల నుంచి సానుకూలమైన సంకేతాలు రాలేద‌ట‌. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నార‌ట నారాయ‌ణ‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle