newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

‘నాని’ నిష్క్రమణకు వేళాయెరా?

15-07-201915-07-2019 15:01:10 IST
Updated On 16-07-2019 10:52:05 ISTUpdated On 16-07-20192019-07-15T09:31:10.355Z15-07-2019 2019-07-15T09:31:07.908Z - 2019-07-16T05:22:05.875Z - 16-07-2019

‘నాని’ నిష్క్రమణకు వేళాయెరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించుకునేందుకే నిశ్చయించుకున్నారా? తొందరలోనే బీజేపీ తీర్థం తీసుకుంటారా? రెండురోజులుగా ట్విట్టర్ వేదికగా నాని చేస్తున్న వ్యాఖ్యానాలే ఈ సందేహాల్ని రేపుతున్నాయి. 

ఈసారి నాని నేరుగా పార్టీ అధినేతను నిలదీస్తూ ‘రాజీనామా చేయమంటారా.. లేక మీ పెంపుడు కుక్కలను నియంత్రిస్తారా.? అంటూ ట్వీట్ చేయడాన్ని బట్టి ఇక కథ క్లైమాక్స్‌కు వచ్చినట్టుగా అనిపిస్తోంది. 

కొద్ది రోజులుగా కేశినేని నాని పార్టీలో తనకు ప్రత్యర్ధులుగా ఉన్న దేవినేని ఉమా, బుద్దా వెంకన్నపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి బుద్దా వెంకన్న, నాగుల్ మీరా స్పందించి అదే ట్విట్టర్ నుంచి ప్రతి విమర్శలు చేయడంతో వివాదం బాగా ముదిరింది. మేటర్ ఇక తుంచేయాలని నిర్ణయించుకున్నారో ఏమో ఎంపీ కేశినేని నాని ఈ పర్యాయం నేరుగా చంద్రబాబుపై గురిపెట్టారు. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పారు. 

‘‘చంద్రబాబు గారూ... నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి’’ అంటూ తాజాగా నాని ట్వీట్ చేశారు.

తన లాంటివాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను నియంత్రించిండని ఆయన పార్టీ నేతను డిమాండ్ చేయడం ఒక కొసమెరుపు.  ఈ ట్వీట్‌ చూశాక ఇక కేశినేని టీడీపీ నుంచి నిష్క్రమించే సమయం వచ్చేసినట్టేనని పలువురు భావిస్తున్నారు. పార్టీ అధినేతను ఇబ్బంది పెట్టేలా నాని ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం శ్రేణుల్ని నివ్వెరపరుస్తోంది. సొంత పార్టీలోని వారిపైనే విమర్శలు చేస్తూ నాని పార్టీని బజారుకు లాగారని టీడీపీ నాయకులు అంటున్నారు. 

పార్టీ ఇప్పుడున్న సంక్షోభంలో సిల్లీగా గిల్లికజ్జాలు పెట్టుకుని...విమర్శలు, ప్రతి విమర్శలతో పరువు తీయడం చూస్తుంటే ఇదంతా కావాలని ఒక పథకం ప్రకారం చేస్తున్నారా.. అని భావించాల్సి వస్తోందని ‘దేశం’ వర్గాలు చెబుతున్నారు,. 

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పాలైన దరిమిలా కేశినేని నాని పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్టు మొదట్లో బాగా ప్రచారం జరిగింది. వైవీఎస్ చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి బాటలో నాని కూడా బీజేపీలో చేరడానికి తగు ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే, నాని దీన్ని కొట్టిపారేశారు. 

Image may contain: 3 people, people smiling, people standing and indoor

(ఫైల్ ఫోటో)

ఆ తరువాత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న వంటి నాయకుల వల్లే కృష్ణా టీడీపీ నాశనం అయిందని, దీనికి వారే బాధ్యత వహించాలని ట్విట్‌లు పెట్టడం మొదలుపెట్టారు. తరువాత పార్టీ నేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎన్నికల్లో పార్టీని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోకుండా మీటింగ్‌లు పెట్టుకుని ఉపయోగం ఏమిటని ఆ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేశారు. 

ఇక అప్పటి నుంచి మళ్లీ చంద్రబాబును కలవని నాని తన ప్రత్యర్ధులపై విమర్శలు గుప్పించడం ఆరంభించారు. దీనికి వెంకన్న నుంచి ఘాటుగా సమాధానం రావడంతో వివాదం బాగా ముదిరింది. ఈ వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో పార్టీ అధినేత లేరన్నది వాస్తవం కాగా, ఇప్పుడు నాని ఆయన పని తేలిక చేస్తూ ‘వెళ్లిపోతా’నంటూ సంకేతాలిచ్చారు. నాని ఉంటారా.. వెళ్లిపోతారా అనేది రానున్న కొద్దిరోజుల్లోనే స్పష్టం కానుంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle