newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?

19-02-202019-02-2020 13:56:12 IST
2020-02-19T08:26:12.600Z19-02-2020 2020-02-19T08:26:08.608Z - - 07-04-2020

నాదెండ్లదీ అదే దారా? పీకేకి షాక్ తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో అర్థం కావడం లేదు. జనసేన పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు బయటకు వచ్చేస్తుండడంతో మిగిలేది ఎవరనేది చర్చనీయాంశంగా మారుతోంది. జనసేనలో పవన్ కల్యాణ్  తర్వాత నెంబర్ 2 ప్లేస్ ఎవరిదని ఎవరిని అడిగినా నాదెండ్ల మనోహర్ అంటారంతా. పవన్ తర్వాత మరో పవర్ సెంటర్ గా కూడా ఆయన ఓ వెలుగు వెలుగుతున్నారు. అలాంటి నాదెండ్ల మనోహర్ బంధం ఇపుడు కొంత బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తాజాగా అమరావతి టూర్ లో మనోహర్ కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత ఆయన సీనియర్ నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఉప సభాపతి, సభాపతిగా పనిచేసిన అనుభవం కలిగిన నేతగా మంచి గుర్తింపు ఉంది. మనోహర్ కి పవన్ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట మనోహర్ ఉండాల్సిందే. పైగా తండ్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కూడా ఉన్నారు.

నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరాక పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల్లో మార్పులు కూడా వచ్చాయని అంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో లోపాయికారి అవగాహనలు, బీఎస్పీ, వామపక్షాలతో పొత్తులకు కూడా నాదెండ్ల మనోహర్ ఆలోచనలే కారణం అంటారు. బీజేపీతో పొత్తుకు కూడా నాదెండ్ల భాస్కరరావే కారణం. కొడుక్కోసం నాదెండ్ల భాస్కరరావు బీజేపీ నేతలతో మాట్లాడారు. తండ్రి బీజేపీలో కొడుకు జనసేనలో వున్నా ఇద్దరి ఆలోచనలు ఒకటే అంటున్నారు. 

అమరావతి పర్యటన పవన్ చేస్తే పక్కన నాదెండ్ల మనోహర్ లేరు. దాని వెనక చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ ముందుగానే పవన్ తో మాట్లాడుకుని తాను అనారోగ్యం వల్ల రాలేనని చెప్పారని అంటున్నారు. అయితే అది సరైన కారణం కాదని, పవన్ పోకడలతో విసుగెత్తిన నాదెండ్ల మనోహర్ అలా కావాలని తప్పుకున్నారని చెబుతున్నారు.

ఒకటి రెండు కార్యక్రమాలకు, సమీక్షలకు పవన్ వెంటే ఉన్నారు కానీ.. కర్నూలు మీటింగ్ లో కానీ, రాజధాని రైతుల కష్టాలు వినేటప్పుడు కానీ ఆయన ఆచూకీ లేదు. ఇప్పటి వరకూ ఏ ఒక్క కార్యక్రమంలోనూ పవన్ పక్కన మిస్ కాకుండా కనిపించిన మనోహర్.. వరుసగా రెండు కీలక పర్యటనల్లో కనిపించకపోయేసరికి జనసైనికుల్లోనే అనుమానాలు తలెత్తాయి. ఆయన ఎక్కడికి వెళ్లారా అని వెతుక్కుంటున్నారు.

అటు జనసేనలో కీలక నేతలందరూ ఒక్కొక్కరే తప్పుకోవడం, అటు పవన్ కూడా సినిమాల్లోకి వెళ్లిపోవడం, ఇటు నాదెండ్ల మనోహర్ వంటి కాస్తో కూస్తో జనాలకు తెలిసిన మొహం కూడా మొహం చాటేయడం చూస్తుంటే అసలు జనసేనని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలనుకుంటున్నారని అర్థమవుతోంది.ఇక పవన్ మళ్ళీ సినిమాల్లో నటించడం నాదెండ్ల మనోహర్ కు అసలు నచ్చలేదని అంటున్నారు.

దీని వల్ల పార్టీ క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, జనం కూడా పవన్ని నాన్ సీరియస్ పొలిటీషియన్ గా చూస్తారని నాదెండ్ల మనోహర్ వాదించారని అంటున్నారు. పవన్ కి ఈ విషయంలో తన వంతుగా సలహా ఇచ్చారని కూడా చెబుతున్నారు. అయితే పవన్ మాత్రం నాదెండ్ల మనోహర్ మాటలను పట్టించుకోకుండా వరసగా సినిమాలు చేసూండడంతో అహం దెబ్బ తిన్న నాదెండ్ల తనకెందుకొచ్చిన తంటా అనుకుని పార్టీకి కొంత దూరం పాటిస్తున్నార‌ని వాదన వినిపిస్తోంది.

మరో వైపు పార్టీలో నాదెండ్ల జోక్యంపై కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రాపాకని సైతం పవన్ ముందే గదమాయించే ధైర్యం ఆయనది. పవన్ కల్యాణే ఆ చనువు ఇచ్చారా లేక, తన రాజకీయ చాతుర్యంతో పవన్ ని డమ్మీ చేసేందుకే నాదెండ్ల చొరవ తీసుకున్నారో తెలియదు కానీ, పవన్ ఏం చేసినా, చేస్తున్నా, చేయాలనుకున్నా.. అన్నీ ఆ మాజీ శాసన సభాపతి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి అనేది మాత్రం వాస్తవం. రాజోలు ఎమ్మెల్యే రాపాక పవన్ ని కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అదే విషయం పదేపదే చెబుతున్నారు రాపాక. 

పవన్ వెంట గత మూడేళ్ళుగా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనకు ఆయువు పోయడానికి తన వంతుగా కృషి చేశారు. పవన్ గ్లామర్ ని పార్టీ కోసం వాడుకునేందుకు అనేక అవకాశాలను అన్వేషించారు. అయితే అతి పెద్ద మైనస్ గా పవన్ వైఖరి ఉండడంతోనే నాదెండ్ల మనోహర్ సక్సెస్ కాలేకపోయారని అంటున్నారు. పవన్ నిలకడ లేని విధానాలు, పూటకో మాటతోనే పార్టీకి విశ్వసనీయత తగ్గిందని అంటున్నారు. 

మరో నాలుగేళ్ళ పాటు పార్టీని పార్ట్ టైం పాలిటిక్స్ తో పవన్ ఇలాగే నడిపితే మరింత ఇబ్బంది వస్తుందని ముందే అంచనాకు వచ్చిన నాదెండ్ల మనోహర్ మెల్లగా సైడ్ అయిపోతున్నారని అంటున్నారు. మరి నాదెండ్ల మనోహర్ కనుక పార్టీని వీడితే అది జనసేనకు, పవన్ కి పెద్ద దెబ్బగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో నాదెండ్ల మనోహర్ ఏ పార్టీలో చేరుతారన్నది మరో చర్చగా ఉంది. ఆయనకు వైసీపీ అప్పట్లోనే ఆఫర్లు ఇచ్చింది. ఆయన కూడా రావాలనుకున్నారు. మరి ఇపుడు ఏం చేస్తారో. భవిష్యత్తు కోసం 2020లో ఆయనేం నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle