newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

‘‘నాడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ .. నేడు సూసైడ్ ఆంధ్రప్రదేశ్’’

16-11-201916-11-2019 16:14:30 IST
Updated On 16-11-2019 16:27:22 ISTUpdated On 16-11-20192019-11-16T10:44:30.491Z16-11-2019 2019-11-16T10:44:28.495Z - 2019-11-16T10:57:22.562Z - 16-11-2019

‘‘నాడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ .. నేడు సూసైడ్ ఆంధ్రప్రదేశ్’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతంగా సాగుతోంది. ఇదే టైంలో టీడీపీ నేతలు కూడా వైసీపీపై తమ మాటల దాడి కొనసాగిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి జగన్ గారు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారంటూ మాజీ మంత్రి లోకేష్ ట్వీట్ లో మండిపడుతున్నారు.

5 నెలల పాలనలో 241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 43 మంది భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని లోకేష్ అన్నారు. అంతేకాదు ఇద్దరు ఉద్యోగులు, ఐదుగురు టిడిపి కార్యకర్తలు,నాయకులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు. 

అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన దివంగత సీఎం వైఎస్ ది ఫ్యాక్షనిజం... ఇప్పుడు పాలిస్తున్ప జగన్ ది సైకోయిజం అని దుయ్యబట్టారు లోకేష్. వైఎస్ అధికారంలోకి వున్నప్పుడు 250 మంది టీడీపీ కార్యకర్తలని చంపారని, జగన్ అధికారంలోకి వచ్చాక సైకోయిజం తో కార్యకర్తలు,నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఛలో ఆత్మకూరుకు ముందు అనేక మంది టీడీపీ సానుభూతి పరులను గ్రామాలనుంచి దూరంగా వెలేశారన్నారు. ఛలో ఆత్మకూరు నిర్వహించిన తరువాత వారిని తిరిగి గ్రామాలకు చేర్చారన్నారు. 

ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డిపాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన ఈ గోడ చూస్తేనే జగన్ గారికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది. వైకాపా గోడలతో ఇళ్ల నుండి బయటకు రాకుండా చెయ్యగలరేమో, కానీ ప్రజల్లో మీ చెత్త ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరన్నారు. 

ఐదునెలల పాలనా కాలంలో ప్రజల కోసం ఏమీ చేయలేదని.. కానీ మానవ హక్కుల సంఘం మాత్రం రాష్ట్రానికి వచ్చేలా చేసారని ఎద్దేవా చేశారు. క్రికెట్ బెట్టింగ్,డ్రగ్స్ మాఫియా అరాచకాలు ఎక్కువ అయ్యాయని, ఎమ్మెల్యేలు ఇసుక వాటాల కోసం కొట్టుకుంటున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు లోకేష్. కార్యకర్తలను వేధిస్తున్న వారిపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్ట్ మెట్లు ఎక్కిస్తామన్నారు. 

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   an hour ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   an hour ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   an hour ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   2 hours ago


బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

బాలయ్యతో వైరల్ అవుతున్న రోజా సెల్ఫీ ఫోటోలు

   2 hours ago


సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి..? ఈ క‌మిటీ ఏం చేయ‌బోతోంది..?

   2 hours ago


నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

నిత్యానందకు చుక్కలు కనిపించనున్నాయా?

   5 hours ago


దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

దేవుళ్ళకీ పౌరసత్వం కావాలి.. చిలుకూరు అర్చకుల డిమాండ్!

   6 hours ago


లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

లోకేష్ ట్వీట్... ఇది బాబు మార్కు ‘సెలెక్ట్’ అంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు

   6 hours ago


మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

మండలిలో ట్విస్ట్.. మూడునెలలు మూడురాజధానులకు బ్రేక్

   7 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle