newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

నాగబాబుకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్

09-04-201909-04-2019 12:58:03 IST
2019-04-09T07:28:03.008Z09-04-2019 2019-04-09T07:28:01.404Z - - 22-07-2019

 నాగబాబుకు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరసాపురం ఎంపీగా జనసేన నుంచి బరిలోకి దిగిన నాగబాబుకు మేనల్లుడు అల్లూ అర్జున్ షాక్‌ ఇచ్చారు. నాగబాబు తరపున ఆయన కుటుంబం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. వరుణ్‌తేజ్‌, నిహారిక, భార్య పద్మజ నాగబాబు తరుపున ప్రచారంలో పాల్గొంటూ ఉండగా.. మిగతా మెగా హీరోలు కూడా వస్తారని అనుకున్నారు. దీనిలో భాగంగానే.. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా నాగబాబును సపోర్ట్‌ చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. 

నాగబాబు భార్య పద్మజ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా బన్నీ ప్రచారానికి వస్తారని తెలిపారు. దీంతో బన్నీ ప్రచారంలో వస్తున్నాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ అంతలోనే బన్ని ఒకే ఒక్క ప్రకటనతో అందరికీ షాక్‌ ఇచ్చారు.తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా.. తన మద్దతు నాగబాబుకు ఉంటుందని ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. నైతికంగాగా ఎప్పుడూ తన వెంట ఉంటామని.. మా సపోర్ట్‌ తనకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసుకుంటామని ఆశించిన బన్నీ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే మరో వైపు.. బన్నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణముందని, అందుకే ఒకే ఒక ప్రకటనతో చేతులు దులుపుకున్నారని టాక్‌ వినిపిస్తోంది.      

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle