ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1393,"2":1710,"3":350,"4":71}

Narendra Modi
1407
Rahul Gandhi
1721
Mayawati
360
Mamata Banerjee
76
BITING NEWS :
*కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్ ...ఓటేసిన ప్రముఖులు *ఇవాళ్టితో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ *ఏపీలొ భద్రత మధ్య రీపోలింగ్ * ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు *తానెక్కడికీ పారిపోలేదు.. నటుడు శివాజీ వివరణ *ఏపీలో హంగ్‌వచ్చే పరిస్థితిలేదు: లగడపాటి *అఖిలేశ్‌తో చంద్రబాబు భేటీ *మోడీపై పరువునష్టం దావా వేసిన మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ

నాగబాబుకి నర్సాపురం టికెట్.. జనసేనలోకి ఎంట్రీ

20-03-201920-03-2019 13:36:18 IST
Updated On 20-03-2019 13:49:38 ISTUpdated On 20-03-20192019-03-20T08:06:18.531Z20-03-2019 2019-03-20T08:06:16.537Z - 2019-03-20T08:19:38.312Z - 20-03-2019

నాగబాబుకి నర్సాపురం టికెట్.. జనసేనలోకి ఎంట్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి జనసేన తరఫున పోటీచేస్తారని ఈనెల 13వ తేదీన ‘న్యూస్ స్టింగ్’ కథనం ప్రచురించింది. అది ఇప్పుడు నిజమయింది. చిరంజీవి సోదరుడు.. పవన్ కళ్యాణ్ మరో అన్న నాగబాబు ఇవాళ అధికారికంగా జనసేనలో చేరారు. తమ స్వంత జిల్లా నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు నాగబాబు.  తమ్ముడి  జనసేన పార్టీకి ఇంతకాలం నైతికంగా మద్దతు ఇస్తున్న మెగాబ్రదర్ నాగబాబు యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగారు. నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 

ముఖ్యంగా నాగబాబు జనసేనలో చేరి కాకినాడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే తాను జనసేనలో చేరే ఆలోచన లేదని నాగబాబు ఎప్పటినుంచో చెబుతూ వచ్చారు. అయితే ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారడంతో... జనసేన తరపున కీలకమైన నరసాపురం లోక్‌సభకు నాగబాబును బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాలోనే కీలకంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. అందుకే జనసేన వ్యూహాత్మకంగానే నాగబాబును ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకుంది. భీమవరం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా జనసేన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు కలిసొస్తుందని... నాగబాబు బరిలో ఉంటే నరసాపురం లోక్‌సభ సీటును కూడా గెలవచ్చనే ప్లాన్‌తోనే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. 

అయితే నరసాపురం లోక్ సభ స్థానానికి టీడీపీ నుంచీ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామ రాజు బరిలో దిగగా... వైసీపీ నుంచీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. పోటీ వీళ్లిద్దరి మధ్యే ఉంటుందని అంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాగబాబు రంగంలోకి దిగితే వీరిద్దరికి పోటీ అవుతారని, కాపు ఓట్లను చీలుస్తారని అంటున్నారు. 

( ‘న్యూస్ స్టింగ్’ఈ నెల 13న ప్రచురించిన కథనం మీకోసం ఇక్కడ అందిస్తున్నాం) 

https://www.newssting.in/p/5c88da408442905155c6e767


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle