newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

నాకూ టికెట్ ఇవ్వండి : పవన్

13-02-201913-02-2019 15:55:15 IST
Updated On 13-02-2019 17:26:51 ISTUpdated On 13-02-20192019-02-13T10:25:15.892Z13-02-2019 2019-02-13T10:25:14.324Z - 2019-02-13T11:56:51.138Z - 13-02-2019

నాకూ టికెట్ ఇవ్వండి : పవన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనాధినేత పవన్‌కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇన్నాళ్ళూ రోడ్ షోలు, ర్యాలీలు, చిన్న చిన్న మీటింగ్‌లతోనే కాలం వెళ్ళదీసిన ఆయన... ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై పూర్తి దృష్టి సారించారు. ఈ విషయమై పవన్ నియమించిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఓ సమావేశం నిర్వహించింది.

పవన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో చర్చించింది. ఈ నేపథ్యంలో స్ర్కీనింగ్ కమిటీకి కొన్ని మార్గదర్శకాలిచ్చింది. ఏయే అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలో సూచనలిచ్చింది. డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వకుండా... నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగా అభ్యర్థిత్వాల్ని ఖరారు చేయాల్సిందిగా పవన్ సూచించారు.

ఈ విషయంలో పార్టీ అధినేతగా తనకూ మినహాయింపు లేదంటూ... టికెట్ కోసం పవన్ తన బయోడేటాను స్ర్కీనింగ్ కమిటీకి సమర్పించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, మాదాసు గంగాధరం, రావెల కిషోర్‌బాబు, తోట చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపే అభ్యర్థుల బయోడేటాలను మాదాసు గంగాధరం ఆధ్వర్యంలో స్ర్కీనింగ్ కమిటీకి సమర్పించాలని పవన్ తెలిపారు.

తాము నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని, పక్క మార్గాలకు వెళ్ళొద్దని ఆయన హెచ్చరించారు. పవన్ తమపై ఉంచిన ఈ బాధ్యతను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని గంగాధరం హామీ ఇచ్చారు. మరోవైపు... విశాఖపట్నం-1 మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి మంగళవారం జనసేన పార్టీలో చేరారు. 1985లో శాసనసభకు ఎన్నికైన ఆమెను పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle