newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

నవ్యాంధ్ర అసెంబ్లీకి ‘నవ’ శోభ.. ప్రత్యేకతలెన్నో!

12-06-201912-06-2019 08:43:56 IST
Updated On 24-06-2019 12:09:20 ISTUpdated On 24-06-20192019-06-12T03:13:56.371Z12-06-2019 2019-06-12T03:12:57.617Z - 2019-06-24T06:39:20.909Z - 24-06-2019

నవ్యాంధ్ర అసెంబ్లీకి ‘నవ’ శోభ.. ప్రత్యేకతలెన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలకు ఇవాళ రంగం సిద్ధమయింది. ఈ సభకు విశిష్టత ఉంది. అధికార పార్టీ అఖండ మెజారిటీతో గెలిస్తే.. అతి తక్కువ సీట్లతో ప్రతిపక్షం ఏర్పడింది. అంతేకాదు ఐదుగురు డిప్యూటీ సీఎంలు సభలో కనిపించనున్నారు.

25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా అధికార స్థానాల్లో కూర్చొనబోతున్న సభ కూడా ఇదే. గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ.  అందుకే బుధవారం తొలిసారిగా కొలువుదీరనున్న 15వ శాసనసభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 

కేవలం ప్రాంతీయ పార్టీలతో ఈ సభ కొలువుతీరనుంది. బీజేపీ గానీ, కాంగ్రెస్, వామపక్షాలు గానీ ఈ సభలో మచ్చుకైనా లేవు. 2014లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. 2019లోనూ సీన్ రిపీట్ అయింది. గత అసెంబ్లీలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి జీరో అయింది. ఒకే ఒక ఎమ్మెల్యేతో జనసేన అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చింది.

జాతీయ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా శాసనసభ ఏర్పాటైంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ రెండో శాసనసభ ఇది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనే కాదు గతంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత భారీ మెజార్టీతో ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.

శాసన సభలోని 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షంగా మిగిలిన టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. 

తొలుత ముఖ్యమంత్రితో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తర్వాత ప్రతిపక్షనేత చంద్రబాబు, మంత్రులు, సభ్యులు ప్రమాణం చేయిస్తారు. 13న స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

ఈనెల 14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో శాసనసభ సమావేశాలు ఉండవు. 17, 18 తేదీలలో గవర్నక్ ప్రసంగంపై చర్చ, సీఎం సమాధానం ఉంటుంది. కొత్త శాసనసభ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   2 hours ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   4 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   4 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   9 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   11 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   12 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   12 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   12 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   12 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle