newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

నవ్యాంధ్రలో ఎందుకీ సంక్షోభం? మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

13-01-202013-01-2020 08:08:45 IST
Updated On 13-01-2020 11:03:17 ISTUpdated On 13-01-20202020-01-13T02:38:45.819Z13-01-2020 2020-01-13T02:38:30.638Z - 2020-01-13T05:33:17.498Z - 13-01-2020

నవ్యాంధ్రలో ఎందుకీ సంక్షోభం? మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతిలో రోజురోజుకీ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తాజాగా ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసుల వైఖరి, వైసీపీ నేతలు, మంత్రుల వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి.

తాజాగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. నవ్యాంధ్ర రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలతో అన్ని జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

అమరావతిలో రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాలను పోలీసుల చేత అణవివేయడం దురదృష్టకరం అన్నారు. రాజధాని రైతుల పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు అవహేళనగా మాట్లాడుతున్నారని, పోలీసులైతే మహిళలపై దాడి చేయరని, పోలీసుల యూనిఫారం ముసుగులో కొంతమంది అరాచక వ్యక్తులు ప్రవేశించినట్టు అనుమానం కలుగుతోందన్నారు.

సీఎం జగన్ పిచ్చి నిర్ణయాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వారికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యారంటున్నారు శోభనాద్రీశ్వరరావు. 

రాజధానుల మార్పుపై మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలే చేశారు. రాజ్యాంగంలోని 214 అధికరణం ప్రకారం ఒక  రాష్ట్రానికి ఒక్కటే హైకోర్టు ఉండాలని, హైద్రాబాద్ నుంచి అమరావతికి హైకోర్టు వస్తున్నప్పుడు ఎంపీ టిజి వెంకటేష్ కర్నూలులో పెట్టమని ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిని అమరావతి లో నిర్మించవద్దని చంద్రబాబు హయాంలోనే కోరామని, అయినా వినలేదని, రైతుల వద్ద భూములు లాక్కొన్నారన్నారు. 

రాజధానిని వైజాగ్‌కు తరలించడం వెనుక ప్రభుత్వం స్కెచ్ ఉందని, అమరావతిలో, వైజాగ్ లో టిడిపి, వైసిపి భూముల కొనుగోలుపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడిపి కి ఎన్టీయారే బలమని, వైసిపి కి బలం వైఎస్ ఆర్ అని ఆ ఇద్దరు నేతలు మంచి పనులు చేశారు కాబట్టే ఆ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. తెలివితక్కువ నిర్ణయాలతో ప్రజల చీత్కారానికి గురి కావద్దని సీఎం జగన్ కి హితవు పలికారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle