newssting
BITING NEWS :
* క‌రోనాపై పోరాటం చేసేందుకు మ‌హా సంక‌ల్పం.. ..రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి దీపాలు వెలిగించిన జనం. దేశమంతా దీపకాంతులు *మోడీ పిలుపునకు స్పందించిన భారతావణి *కరోనా కాటుకు లిబియా మాజీ ప్రధానమంత్రి జిబ్రిల్ మృతి *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు*తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు *దేశ వ్యాప్తంగా 3831కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా 120 మంది మృతి*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ*జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్. జవాన్లు-ఉగ్రవాదులకు మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు. నిన్నటి నుంచి కెరాన్, భత్పూరా సెక్టార్లలో జవాన్ల కూబింగ్. భద్రతా దళాల కాల్పుల్లో 9మంది ఉగ్రవాదులు హతం. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాన్ మృతి. ఇద్దరికి గాయాలు*లాక్ డౌన్ పాటించకుండా ప్రార్ధనలు చేసిన పాస్టర్ అరెస్ట్. తూర్పు గోదావరి జిలా రాయవరంలో ఈ సంఘటన జరిగింది. ప్రార్ధనా మందిరంలో 150 మంది. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించిన స్థానికులు*10వేలదిశగా మొత్తం అమెరికా మృతులు. 4 లక్షల దిశగా మొత్తం కరోనా బాధితులు. వచ్చే రెండు వారాల్లో ఇంకెన్ని చావులు చూడాలో. అంచనాలు ఊహకు కూడా అందడం లేదు. 96శాతం అమెరికన్లను ఇంట్లోనే ఉండమన్నాం - ట్రంప్

నవ్యాంధ్రకు నయా జోష్. కొత్త సీఎం, కొత్త గవర్నర్

24-07-201924-07-2019 12:44:30 IST
Updated On 25-07-2019 10:52:03 ISTUpdated On 25-07-20192019-07-24T07:14:30.407Z24-07-2019 2019-07-24T07:14:27.865Z - 2019-07-25T05:22:03.926Z - 25-07-2019

నవ్యాంధ్రకు నయా జోష్. కొత్త సీఎం, కొత్త గవర్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి ప్రథమ పౌరుడు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు.

Biswa Bhusan Harichandan Swear in As AP Governor - Sakshi

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రతిపక్షనేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌, పలువురు ముఖ్య అధికారులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే నరసింహన్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 

సుమారు రెండునెలలోపే ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు కొత్త నేతలు వచ్చినట్టయింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి, గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చారు. దీంతో అటు రాజ్యాంగపరమయిన, ఇటు పాలనా పరంగా కొత్త వ్యక్తులు బాధ్యతలు స్వీకరించినట్టయింది.

బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1934 ఆగస్టు 3న రాజకుటుంబంలో జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ డిగ్రీ పూర్తి చేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. ఆయనకు భారతీయ జనతాపార్టీతో దీర్ఘకాలిక అనుబంధం ఉంది. 1980లో బీజేపీ ఒడిశా అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిశ్వభూషణ్‌ పనిచేశారు.

1990లో బిజూ పట్నాయక్‌ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1996లో ఒడిశా బీజేఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ,బీజేడీ ఉమ్మడి ప్రభుత్వంలోనూ మంత్రి అయ్యారు. రెండురోజుల క్రితమే రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం విజయవాడకు వచ్చారు. సుదీర్ఘకాలం పనిచేసిన నరసింహన్ వివాదరహితుడుగా పేరుతెచ్చుకున్నారు. తన పాలనా అనుభవంతో అటు కేంద్రం-ఇటు రాష్ట్రంతో సత్సంబంధాలు నెలకొల్పారు. యువ నేత జగన్-అనుభవ శాలి బిశ్వభూషణ్ హరిచందన్ హయాంలో ఏపీ అభివృద్దిలో ఎలాంటి ముందడుగు వేస్తుందో చూడాలి.  

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

   10 hours ago


వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

   14 hours ago


కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

   18 hours ago


కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

   18 hours ago


అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

   20 hours ago


మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

   21 hours ago


జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

   21 hours ago


కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

   a day ago


లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

   a day ago


అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle