newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

నవయుగ భారీమోసాలు.. సర్కార్ భూమి తాకట్టు

22-10-201922-10-2019 09:20:28 IST
Updated On 22-10-2019 13:04:11 ISTUpdated On 22-10-20192019-10-22T03:50:28.567Z22-10-2019 2019-10-22T03:50:22.702Z - 2019-10-22T07:34:11.300Z - 22-10-2019

నవయుగ భారీమోసాలు.. సర్కార్ భూమి తాకట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న‌వ‌యుగ సంస్థ‌కు సంబంధించి మ‌రో కీల‌క‌మైన అంశాన్ని ప్ర‌భుత్వం వెలుగులోకి తెచ్చింది. కృష్ణ‌ప‌ట్నం పోర్టు స‌మీపంలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్కు ఏర్పాటు చేస్తామంటూ గ‌తంలో ప్ర‌భుత్వం నుంచి న‌వ‌యుగ సంస్థ ఏకంగా 4,731 ఎక‌రాల భూమిని తీసుకుంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అక్క‌డ ఎలాంటి ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంతో ఇటీవ‌లె ప్ర‌భుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంది.

అయితే, ఈ భూమి తన ఆధీనంలో ఉండ‌గా న‌వ‌యుగ సంస్థ ఈ భూమిని తాక‌ట్టుపెట్టి వంద‌ల కోట్ల రూపాయ‌ల రుణాన్ని బ్యాంకుల నుంచి తెచ్చుకుంది. రూ.1900 కోట్ల‌ను వివిధ బ్యాంకుల నుంచి ఈ భూమిని తాక‌ట్టుపెట్టి న‌వ‌యుగ సంస్థ సంపాదించింది.

కాగా, ఈ రుణాల వ్య‌వ‌హారంలో న‌వ‌యుగ సంస్థ‌తోపాటు బ్యాంకుల ప‌నితీరుపైన కూడా అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ధానంగా కొన్ని ఉల్లంఘ‌ట‌నలు జ‌రిగాయి. ఎప్పుడైనా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తామంటూ ప్ర‌భుత్వం నుంచి భూమి తీసుకుని, ఆ భూమిని బ్యాంకుల్లో తాక‌ట్టుపెట్టి స‌ద‌రు సంస్థ రుణాలు తెచ్చుకోవాలంటే ఏపీఐఐసీ నుంచి నిరంభ్యంత‌ర ప‌త్రం త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌రం.

ఏపీఐఐసీ నుంచి నిరభ్యంత‌ర ప‌త్రం పొందిన త‌రువాత మాత్ర‌మే బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ భూముల తాక‌ట్టుకు ఏపీ ఐఐసీ నుంచి ఎలాంటి నిరంభ్యంత‌ర ప‌త్రం లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా బ్యాంకులు న‌వ‌యుగ సంస్థ‌కు వంద‌ల కోట్ల రుణ‌ల‌ను ఇచ్చేశాయి.

ఇందులో ఐసీఐసీఐ బ్యాంకు రూ.400 కోట్లు, సెంట్ర‌ల్ బ్యాంకు రూ.250 కోట్లు, అల‌హాబాద్ బ్యాంకు రూ.200 కోట్ల‌ను న‌వ‌యుగ సంస్థ‌కు ఏపీఐఐసీ నుంచి ఎలాంటి నిర‌భ్యంత‌ర ప‌త్రం లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా కేటాయించాయి. మ‌రో బ్యాంకును కూడా ఇలాగే రుణం కోసం న‌వ‌యుగ సంస్థ సంప్ర‌దించ‌గా, ఆ బ్యాంకు మాత్రం కాస్త క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఈ భూముల‌ను తాక‌ట్టుకుపెట్టుకుని రుణం ఇవ్వాలంటే ఏపీఐఐసీ నుంచి నిరంభ్యంత‌ర ప‌త్రం తేవాల‌ని స్ప‌ష్టం చేసింది. కానీ, అలా నిరంభ్యంత‌ర ప‌త్రం తీసుకురాలేక‌పోవ‌డంతో ఆ రూ.250 కోట్ల రుణం మాత్రం న‌వ‌యుగ సంస్థ అందుకోలేక‌పోయింది.

మ‌రో ప్ర‌ధాన ఉల్లంఘ‌న ఏమిటంటే..? ప‌్ర‌భుత్వం ఈ రూ.4,731 ఎక‌రాల భూమిని కృష్ణ‌ప‌ట్నం, ఇన్ఫ్రాటెక్ ప్ర‌యివేట్ లిమిటెడ్ పేరుతో కేటాయించింది. కానీ, న‌వ‌యుగ సంస్థ ఈ భూమిని మాత్రం వేర్వేరు కంపెనీల పేరుతో బ్యాంకుల్లో తాక‌ట్టుపెట్టి వంద‌ల కోట్ల రూపాయ‌ల రుణం తీసుకుంది. ఇలా ఒక కంపెనీకి కేటాయించిన భూముల‌ను ఆ భూముల పేరుమీద ఇత‌ర కంపెనీల‌తో వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను బ్యాంకులు ఎలా రుణంగా ఇచ్చాయ‌న్న‌దే ఇప్పుడు ప్ర‌ధానంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle