newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

నర్సాపురం బరిలో నాగబాబు..?

13-03-201913-03-2019 16:03:03 IST
Updated On 13-03-2019 19:31:15 ISTUpdated On 13-03-20192019-03-13T10:33:03.976Z13-03-2019 2019-03-13T10:24:00.275Z - 2019-03-13T14:01:15.926Z - 13-03-2019

నర్సాపురం బరిలో నాగబాబు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వ్యూహం ఏంటో అర్థంకాక రాజకీయ విశ్లేషకులు సైతం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. టీడీపీ, వైసీపీలకు పోటీగా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించింది.  నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ ఆశ పడుతున్నారు.

దీనికి తగ్గట్టు జిల్లాలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తూ వచ్చారు. ఒక దశలో తాను పశ్చిమగోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తానన్నారు. అందులో భాగంగా ఏలూరులో అద్దె ఇల్లు కూడా తీసుకున్నారు. ఓటు హక్కు కూడా అక్కడే ఉంది.

అనంతపురం, శ్రీకాకుళం కూడా తెరమీదకు వచ్చాయి. మొన్నామధ్య విద్యార్ధులతో ముఖాముఖి సందర్భంగా కర్నూలు కూడా వార్తల్లోకి వచ్చింది. అయితే అసలు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? పార్లమెంటుకా..? అసెంబ్లీకా..? అనేది సస్పెన్స్‌గా మిగిలింది. తాజాగా రాజకీయ ప్రస్తావనలో ఆయన సోదరుడు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జనసేన ముఖ్యనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తవానికి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగుతారని భావించారు. చిరంజీవి ఓటమి పొందిన పాలకొల్లులో తిరిగి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారనే వాదనలు కూడా వినిపించాయి. 

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబుని బరిలోకి దిగితే, మిగతా అసెంబ్లీ స్థానాలపై దీని ప్రభావం పడుతుందని, పార్టీ ఆయా స్థానాల్లో సులువుగా గెలిచేందుకు వీలు ఉంటుందని పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. 2009లో పీఆర్పీ నుంచి పాలకొల్లులో పోటీచేసిన చిరంజీవి...కాంగ్రెస్ అభ్యర్ధి బంగారు ఉషారాణి చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.

గతంలో తమ కుటుంబానికి జరిగిన అవమానాలను జనసేన నుంచి గెలుపొంది తిప్పికొట్టాలనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకనే నరసాపురం, పాలకొల్లు స్థానాల ప్రతిపాదన కొత్తగా పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే తరుణంలో తమ సొంతూరు మొగల్తూరు నరసాపురం పరిధిలోనే ఉండడం పార్టీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.  ఈవార్తలను జనసేన వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. ప్రతిపాదన అయితే వచ్చిందని, అది ఎంతవరకూ వాస్తవం అవుతుందో తెలీదంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle