newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

నరసింహన్ వీడ్కోలు సభ@టీ 20 కామెంటరీ

23-07-201923-07-2019 09:39:20 IST
Updated On 23-07-2019 11:00:58 ISTUpdated On 23-07-20192019-07-23T04:09:20.870Z23-07-2019 2019-07-23T04:09:15.264Z - 2019-07-23T05:30:58.147Z - 23-07-2019

నరసింహన్ వీడ్కోలు సభ@టీ 20 కామెంటరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈఎస్ఎల్ నరసింహన్..నిన్నటివరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్. తాజాగా ఆయన ఏపీ రాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి వీడ్కోలు పొందారు. సుదీర్ఘకాలం గవర్నర్ గా ఉన్న నరసింహన్ తనదైన ముద్ర వేశారు. విజయవాడలో జరిగిన వీడ్కోలు సభ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అచ్చం టీ20 క్రికెట్ కామెంటరీని తలపించింది.

Image may contain: 6 people, people standing

ముఖ్యమంత్రి జగన్‌ 34 రోజులుగా ప్రతి బంతినీ బౌండరీకి తరలిస్తున్నారని, టీ20 క్రికెట్‌ మ్యాచ్‌లా చివరి అయిదు ఓవర్లలోనూ మళ్లీ జగన్‌ హిట్టింగ్‌ చేస్తారనుకుంటున్నానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా జగన్‌ మ్యాచ్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలవాలని, సెంచరీలపై సెంచరీలు కొడుతూ దూసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు నరసింహన్ చెప్పారు. 

జగన్‌ పాలనను టీ20 క్రికెట్‌ మ్యాచ్‌తో గవర్నర్‌ పోల్చడంతో నవ్వులు పువ్వులు పూశాయి. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో సోమవారం రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు ప్రభుత్వం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నరసింహన్‌ను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్‌, భారతి దంపతులు ఘనంగా సత్కరించారు. విజయవాడతో తన అనుబంధాన్ని నరసింహన్ గుర్తుచేసుకున్నారు. 

1951లో విజయవాడలోని ఎట్కిన్‌సన్‌ స్కూలులో తనకు అక్షరాభ్యాసం జరిగిందని, గవర్నర్‌పేటలో ఉండేవాళ్లమని, ఇదే రాష్ట్రానికి గవర్నర్‌గా వస్తానని కలలోనూ అనుకోలేదని నరసింహన్‌ అన్నారు.

Image may contain: 2 people, people smiling, people sitting and text

తల్లిదండ్రులు తనకు అహోబిలం నరసింహస్వామి పేరు పెట్టారన్నారు. ఐపీఎస్‌ తర్వాత నంద్యాలలో శిక్షణ తీసుకున్నానని చెప్పారు. తనకు, తన శ్రీమతి విమలకు ఇదెంతో భావోద్వేగ సమయం..అంటూ ప్రసంగం ప్రారంభించిన నరసింహన్‌ రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఏపీ శాసనసభ సమావేశాలు చూస్తుంటే జగన్‌ అవే విధానాలు అవలంబిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను చక్కగా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

ఏపీలో తొమ్మిదిన్నరేళ్లు గవర్నర్‌గా ఉండడం ...ఏపీతో విడదీయరాని బంధమని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా సీఎం జగన్ భావోద్వేగంతో మాట్లాడారు.  గవర్నర్‌ నరసింహన్‌ను ఇలా సాగనంపడం బాధగా ఉందన్నారు.

ఆయన ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయనే ఆశాభావం ప్రకటించారు. మరోవైపు మంగళవారం విజయవాడ రానున్నారు ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్. మొత్తం మీద గవర్నర్ నరసింహన్ కాంగ్రెస్ హయాంలో గవర్నర్ అయినా బీజేపీ హయాంలోనూ ఐదేళ్ళకు పైగా కొనసాగడం ఆయన రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle