newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-2

14-07-201914-07-2019 08:04:42 IST
Updated On 14-07-2019 08:09:34 ISTUpdated On 14-07-20192019-07-14T02:34:42.108Z14-07-2019 2019-07-14T02:34:38.835Z - 2019-07-14T02:39:34.329Z - 14-07-2019

నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-1

‘ఆళ్ల’ కోసం ఆ మాత్రం చేయాల్సిందే..

ప్రభుత్వం ఏర్పాటైన 40 రోజుల్లోనే ముఖ్యమైన నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు ఒక్కొక్కటిగా పూర్తిచేస్తూ జగన్మోహన్‌రెడ్డి గత ముఖ్యమంత్రి కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) చైర్మన్‌గా సంప్రదాయానికి భిన్నంగా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించారు. 

సాధారణంగా సీఆర్‌డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా వేరొకర్ని ఆ పదవిలోకి తీసుకోవాలంటే చట్టంలో తగు సవరణ చేయాలి. చంద్రబాబు వారసుణ్ని ఓడించినందుకు బహుమానంగా ‘ఆళ్ల’కు ఆమాత్రం చేయాలని కొత్త ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా చంద్రబాబును తిట్టడంలో పీహెచ్‌డీ పొందిన మాస్ లీడర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గిరీని కట్టబెట్టారు. 

‘ద్రోణు’డికి తగిన దక్షిణ

తాజాగా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా మాజీ శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2016లో వీఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఈ సంస్థకు చైర్మన్ నియామకం జరగడం ఇదే ప్రథమం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ద్రోణంరాజు మొన్నటి ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన ద్రోణంరాజు ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా పనిచేశారు. ఈ పర్యాయం పరాజయం పొందినప్పటికీ పార్టీని నమ్ముకున్న అందరికీ పదవులు పంచుతున్న జగన్మోహన్‌రెడ్డి ‘ద్రోణు’డికి తగిన దక్షిణ చెల్లించారు. 

ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పోస్టులో తన దగ్గరి బంధువు వైవీ సుబ్బారెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి.. వైసీపీలో అత్యంత ముఖ్యుడైన విజయసాయిరెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో నియమించుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్న వారిని లాభదాయక ఇతర పదవుల్లో ఉండరాదన్న నిబంధనను కేంద్రం మార్చడంతో విజయసాయి నియామకానికి తిరుగు లేకుండాపోయింది. ఇక, తన మంత్రివర్గంలో స్థానం దక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు వైసీపీ అధినేత ఏపీఐఐసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. 

మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌గా నియమించారు. పార్టీ గొంతుకగా ప్రసార మాధ్యమంలో తన వాణిని వినిపించిన వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్‌గా అంబటి రాంబాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా యేసురత్నం, ఎస్‌సీ కమిషన్ చైర్మన్‌గా మోషేన్ రాజు, రాయలసీమ అభివృద్ధి మండలి చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిలకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని, రేపోమాపో ఈ నియామకాలపై ఒక ప్రకటన రావచ్చునని భావిస్తున్నారు.

జిల్లాస్థాయిలో సిద్ధమవుతున్న జాబితాలు..

వీలైనంత తొందరలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులనూ భ‌ర్తీ చేయాలని ముఖ్యమంత్రి జ‌గ‌న్ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. తొలి నుంచి పార్టీలో ఉంటూ.. త‌న‌ని నమ్ముకున్న వారికే ఈ ప‌ద‌వుల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఇక‌, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులను పూర్తిగా ద్వితీయ శ్రేణి నేతలకు ఇవ్వాల‌ని భావిస్తున్నట్టు సమాచారం.

అర్హతలు ఉన్న వారి పేర్లతో  జాబితాలు సేక‌రించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో 50 శాతం వ‌ర‌కు బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల‌కు ఇవ్వాల‌ని భావిస్తున్నట్టు ఇప్పటికే జ‌గ‌న్ ప్రకటించారు. సామాజిక, ప్రాంతీయ స‌మీక‌ర‌ణాలను దృష్టిలో ఉంచుకొని నియామకాల‌ను వీలైనంత తొందరలో పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle