newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-1

14-07-201914-07-2019 08:02:05 IST
Updated On 14-07-2019 08:10:53 ISTUpdated On 14-07-20192019-07-14T02:32:05.391Z14-07-2019 2019-07-14T02:31:34.527Z - 2019-07-14T02:40:53.247Z - 14-07-2019

నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాలుగేళ్లు నాన్చారు. జగన్ వచ్చీ రాగానే పదవుల తాయిలాలు పంచుతున్నారు. ఇద్దరి మధ్యా ఎంత వ్యత్యాసమో!’ అని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగుదేశం నాయకులు. కమెడియన్ పృధ్వీరాజ్‌కు తిరుమల తిరుమతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ బాధ్యతలు కట్టబెడుతూ ఆదేశాలిచ్చారని వచ్చిన వార్త చాలామందిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్ని ఆశించి భంగపడిన అనేకమంది ద్వితీయశ్రేణి నేతల్ని నిర్ఘాంతపరచింది. ‘నమ్ముకుంటే ఈ స్థాయి నజరానాలు దక్కుతాయా..’ అనుకుంటూ ఇక ఇదే అంశంపై తెగ చర్చించుకుంటున్నారు.

‘మేళ్లు’కు వెనుకాడని వైఎస్ వారసుడు

తమకు విశ్వాసపాత్రులుగా వున్న వారిని ఎటువంటి ‘మేళ్లు’ చేయడానికైనా వెనుకాడని నేతగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనమైన పేరు ఉంది. అందుకు ఎన్నో దృష్టాంతాలను ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఆ తండ్రికి వారసుడిగా జగన్మోహన్‌రెడ్డి తనేమిటో ఇప్పుడు నిరూపించుకుంటున్నారు. తొమ్మిదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి తన వెంట నడిచిన అనుచరులందరికీ అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తున్నారు. కొందరికైతే వారు కలలో కూడా ఊహించనట్టుగా కీలకమైన పదవుల్లో కూర్చోబెడుతున్నారు. 

ఐదుగురికి సలహాదారు హోదా

తనకు రాజకీయంగా, ఇన్నాళ్లూ సలహాలు అందించి గెలుపు దిశగా నడిపించిన ఐదుగురికి క్యాబినెట్ హోదా ఇచ్చి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకున్నారు. అందులో తన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను రూపొందించడంలో సహాయకారిగా నిలిచిన వ్యక్తి కూడా ఉండటం వైసీపీ వర్గాలనే విస్మయపరచింది. ముఖ్యమంత్రి కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ రూపొందించే ఇతనికి క్యాబినెట్ ర్యాంక్ ప్రకటించడం పట్ల అధికారులు ఒకరిద్దరు అభ్యంతరం చెప్పి, విమర్శలు వస్తాయని వివరించినా ముఖ్యమంత్రి ఖాతరు చేయలేదని సమాచారం. 

పాలనా వ్యవహారాల్లో ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారుల్ని సలహాదారులుగా సీఎంవోలోకి తీసుకుంటున్నట్టు తొలుత ప్రకటించారు. అలాగే, మీడియా వ్యవహారాల్లో తనకు ప్రసంగాలు రాసిపెట్టిన జర్నలిస్టుని మరో సలహాదారుగా తీసుకున్నారు. ఆ తరువాత ప్రజా వ్యవహారాల సలహాదారుగా తన ముఖ్య అనుచరుడికి అవకాశం కల్పించారు. వీరందరికీ క్యాబినెట్ హోదా ఇవ్వడమే విశేషం. క్యాబినెట్ హోదా ఇచ్చి ఆయా వ్యక్తులను సముచిత రీతిలో గౌరవించుకోవడం ప్రభుత్వానికి అనివార్యం కావచ్చు.

చెప్పాలంటే ఇది అంతగా అక్షేపణీయమైన అంశమే కానప్పటికీ, తనది ‘పొదుపు’ పాటించే ప్రభుత్వంగా ఆదిలోనే ప్రకటించుకున్న జగన్ సర్కార్‌కు సీఎంవోలోనే ఇంత వ్యయాన్ని భరించాల్సి రావడమే ఇక్కడ ప్రస్తాననార్హం. క్యాబినెట్ హోదా అంటే ఒక అంచనా ప్రకారం నెలకు కనిష్టంగా రూ.10 లక్షల వ్యయమైనా ఉంటుంది. క్యాబినెట్ హోదాలో ఉండే వ్యక్తుల కుటుంబ ఆరోగ్య చికిత్సల ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాల్సివుంటుంది. ఆ లెక్కన ఇంతమందిని పరిగణనలోకి తీసుకుంటే ఇదంతా అంచనాకు అందని వ్యయంగా భావించాలి.     

చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఎంతోమంది సలహాదారులు ఉన్నా, వారెవరికీ ఇలా క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. కమ్యూనికేషన్ల వ్యవహారాలు చూసే విద్యాధికుడు డాక్టర్ పరకాల ప్రభాకర్‌ విషయంలో మాత్రమే చంద్రబాబు ఆ మర్యాద పాటించారు. అది కూడా ఇద్దరు ప్రధానమంత్రుల దగ్గర పనిచేసిన విశేష అనుభవం, ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవహారాల్లో ఉన్న దక్షత చూసి మాత్రమే పరకాల ప్రభాకర్‌కు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడంతో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పలేకపోయారు. 

కొత్త పేర్లు.. కొత్త హోదాలతో ఆస్థానంలో అందరికీ అవకాశం..

సలహాదారుల నియామకాలతోనే సరిపెట్టకుండా తనను నమ్ముకున్న మిగిలిన అనుచరులందరికీ ఏదోవిధంగా జగన్ తన పేషీలో అవకాశాలు కల్పించడం ఇక్కడ ప్రస్తావనార్హం. పీఏ, పీఎస్ వంటి పోస్టులకు కొత్త పేర్లు, హోదాలు తగిలించి వారందరినీ తన చెంతనే ఉంచుకున్నారు. ‘ట్యూషన్ మాస్టారు’ సోమయాజులు కుమారుడి మొదలు పాదయాత్రలో తన బాగోగులు చూసుకున్న డాక్టరు గారి వరకు అందరికీ తగిన స్థానమిచ్చారు.

(ఇంకా ఉంది) నమ్ముకున్న వారికి నజరానా.. ఇది జగన్ నయా జమానా-2


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle