newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

‘‘నన్ను వదిలెయ్యండి. ఇంకెప్పుడూ సర్వేలు చేయను’’

23-05-201923-05-2019 12:13:33 IST
Updated On 23-05-2019 18:50:08 ISTUpdated On 23-05-20192019-05-23T06:43:33.311Z23-05-2019 2019-05-23T06:43:31.931Z - 2019-05-23T13:20:08.912Z - 23-05-2019

 ‘‘నన్ను వదిలెయ్యండి. ఇంకెప్పుడూ సర్వేలు చేయను’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంచనాలకు దూరంగా చేసిన లగడపాటి సర్వేలు ఏపీలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా టీడీపీ గెలుస్తుందని లగడపాటి తన ఫ్లాష్ టీం సర్వేలో తేల్చారు. ఈ సర్వేపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. స్వయంగా టీడీపీకి చెందిన మంత్రులే ఈసర్వేలపై విమర్శలు చేశారు. రాజగోపాల్‌ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. తాజాగా లగడపాటి సర్వేపై సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. నన్ను వదిలెయ్యండి. ఇంకెప్పుడూ సర్వేలు చేయను అంటూ ఆయన పశ్చాత్తాప పడినట్టు ఈ ఫోటో కనిపిస్తోంది.లగడపాటి సర్వేకి భిన్నంగా 150 సీట్లకు పైగా వైసీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇటు లోక్ సభ ఫలితాల్లోనూ లగడపాటి సర్వే తప్పని తేలింది. ఈ ట్వీట్ రాంగోపాల్ వర్మ చేసినట్టు కనిపిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle