newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

నగరిలో రోజాను అడ్డుకున్న వైసీపీ క్యాడర్.. కేసు నమోదు

06-01-202006-01-2020 12:55:51 IST
Updated On 06-01-2020 13:09:54 ISTUpdated On 06-01-20202020-01-06T07:25:51.666Z06-01-2020 2020-01-06T07:25:49.628Z - 2020-01-06T07:39:54.005Z - 06-01-2020

నగరిలో రోజాను అడ్డుకున్న వైసీపీ క్యాడర్.. కేసు నమోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా. అంతేకాదు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ కూడా. అయినా ఆమెకు స్వంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. కేబీఆర్‌పురంలో గ్రామసచివాలయం ప్రారంభోత్సవానికి వెళుతుండగా ఆమె కారుపై దాడికి తెగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. టీడీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మాజీ ఎంపీటీసీ కుమారుడు, మరికొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రోజా కారును అడ్డగించారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే, పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

నిరసన తెలుపుతున్న కార్యకర్తలతో రోజా మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే రోజా కారు అద్దం దించి వారికి సర్దిచెప్పబోయారు. అయితే, వైసీపీ కార్యకర్తలు ఆమె మాట వినకుండా మరింత పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రోజా అసహనం వ్యక్తం చేశారు.

అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆమె కారు అద్దం మూసేసి ముందుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటనలో 37మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. స్వంత ఎమ్మెల్యేపైనే ఆపార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అంతా విస్తుబోయారు. 

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   41 minutes ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   an hour ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   an hour ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle