newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

‘నగరి’లో రోజాకు పోటీ ఇచ్చేది ఎవరు?

08-03-201908-03-2019 13:14:02 IST
Updated On 08-03-2019 19:31:50 ISTUpdated On 08-03-20192019-03-08T07:44:02.424Z08-03-2019 2019-03-08T07:31:46.738Z - 2019-03-08T14:01:50.823Z - 08-03-2019

‘నగరి’లో రోజాకు పోటీ ఇచ్చేది ఎవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ ఎంఎల్ఏ రోజా పేరు వింటేనే చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే... నగరి నియోజకవర్గంలో ఆమె మీద పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడమే అందుకు కారణం. నగరి నియోజకవర్గం మీద చంద్రబాబు జరిపిన సమీక్షలో ఇప్పటి దాకా ఏకాభిప్రాయానికి రాలేక పోయింది టీడీపీ అధిష్టానం. రోజాతో సై అనేందుకు టీడీపీ నుంచి ధీటైన వ్యక్తి చంద్రబాబుకు ఎక్కడా కనిపించలేదట.

చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై సమీక్ష జరిపిన చంద్రబాబు... చిత్తూరు ఎంపీగా శివప్రసాద్‌కు మళ్లీ సీట్ ఖాయం చేశారు. అలాగే పలమనేరు నుంచి అమరనాథరెడ్డికీ, చంద్రగిరి నుంచి పులివర్తి నానికి సీటు కేటాయించేశారు. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎంఎల్ఏ సత్యప్రభ మినహా ఇంకెవరూ లేక పోవడంతో ఆమెకే సీటు ఖాయం చేశారు. అయితే గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

ఇదంతా ఓ ఎత్తయితే... వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మీద పోటీకి ఎవరన్నదే టీడీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమనాయుడు పోటీ చేశారు. అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన చనిపోవడంతో టీడీపీకి ఆ లోటు పూడ్చే వారు కరువయ్యారు. ముద్దు కృష్ణమనాయుడి సతీమణి సరస్వతమ్మ, కుమారుడు భాను ప్రకాష్... ఇద్దరిలో ఒకరిని పోటీలో పెట్టాలని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే వీరు మాస్ నేతలు కాదన్న భయం కూడా టీడీపీ నేతల్లో ఉంది. రోజా ధాటికి వీరు తట్టుకోవడం కష్టమని చెబుతున్నారు. దీంతో రోజాను ఎదుర్కొనే నేత ఎవరన్న దానిపై నగరి టీడీపీ కార్యకర్తలను వేధిస్తోంది.

మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. తననియోజకవర్గమైన నగరిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి అందరిమన్నలను అందుకున్న రోజా తాజాగా మరోసేవా కార్యక్రమంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నగరి నియోజకవర్గంలోని నగరి మున్సిపాలిటీలో  రూ.2కే 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. ఈనేపథ్యంలో నగరిలో రోజాను ఓడించడం అంత ఆషామాషీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle