newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

నందికొట్కూరు సభలో జగన్ చారిత్రక ప్రకటన !

30-03-201930-03-2019 17:29:57 IST
2019-03-30T11:59:57.395Z30-03-2019 2019-03-30T11:59:55.328Z - - 24-02-2020

నందికొట్కూరు సభలో జగన్ చారిత్రక ప్రకటన !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడి ఐదేళ్లు అధికారం అప్పగించిన చంద్రబాబు.. తమకు జాబులు ఇవ్వలేదన్న ఆవేశం, ఆగ్రహం యువతలో కనిపిస్తోంది. జగన్ చేసిన పాదయాత్రలోనూ యువత, వారి తల్లిదండ్రులు ఉద్యోగాలివ్వాలని ఆయనకు పదే పదే చెప్పారు. అందుకే నందికొట్కూరు ఎన్నికల ప్రచార సభలో చారిత్రక ప్రకటన చేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలనూ భర్తీ చేస్తానని ప్రకటించారు. 

అంతేకాదు.. ప్రతి యేటా జనవరిలో ఆ యేడాది ఉన్న మొత్తం ఖాళీలను తన ప్రభుత్వం ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. కేరళలో గ్రామ సెక్రటేరియట్ల వ్యవస్థ బలంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అదే అక్కడ ప్రభుత్వ వ్యవస్థకు పునాదిగా చెప్పవచ్చు. గతంలోనే ఆ వ్యవస్థను స్టడీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్లు తెచ్చి వాటిలో అదే గ్రామస్తులైన పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రామంలో విలేజ్ వాలెంటీర్ల వ్యవస్థను తెస్తానన్న జగన్.. ప్రతి 50 ఇళ్లకూ ఓ విలేజ్ వాలెంటీర్ ఉంటాడనీ.. ఆ వ్యక్తికి ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తుందని ప్రకటించారు.

ప్రతి పరిశ్రమల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా తొలి శాసనసభలోనే చట్టం తీసుకొస్తాననీ.. యువతకు శిక్షణ ఇచ్చే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామనీ జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రకాల కాంట్రాక్టులు బయటి వ్యక్తులకు ఇవ్వాల్సి వస్తే నిరుద్యోగ యువతకే ఆ కాంట్రాక్టులు ఇస్తామని జగన్ నందికొట్కూరులో ప్రకటించారు. ఈ కాంట్రాక్టుల కేటాయింపులో 50 శాతం ఎస్సీఎస్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జగన్ చేసిన ఈ ప్రకటన మొత్తం ప్రచారంలోనే అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle