newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ధూళిపాళ్ళ ఎదురీదుతున్నారా?

02-05-201902-05-2019 08:20:11 IST
2019-05-02T02:50:11.157Z02-05-2019 2019-05-02T02:49:52.249Z - - 16-12-2019

ధూళిపాళ్ళ ఎదురీదుతున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు జిల్లా పొన్నూరు ఎంఎల్ఏ ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్, ఈ ఎన్నిక‌ల్లో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నార‌ట‌. తండ్రి ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి నుంచి రాజ‌కీయ వార‌స‌త్వం పొందిన న‌రేంద్ర కుమార్, వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచి నియోజ‌క‌వ‌ర్గంలో రికార్డ్ న‌మోదు చేశారు. 

గ్రామ స్థాయి నుంచి బ‌ల‌మైన క్యాడ‌ర్ పెంచుకున్న ఆయ‌న‌, వైఎస్ హ‌వా ఉన్న స‌మ‌యంలో కూడా గెలిచి త‌న స‌త్తా చాటారు. 1994 నుంచీ 2014 ఎన్నిక‌ల దాకా తిరుగులేని నేత‌గా పొన్నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చక్రం తిప్పుతున్న న‌రేంద్ర‌, ఈ ఎన్నిక‌ల్లో డిఫెన్సులో ప‌డిన‌ట్లు పొన్నూరులో ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ప్ర‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధుల తొంద‌ర‌బాటు నిర్ణ‌యం, అనాలోచిత వ్యూహం న‌రేంద్ర‌కు క‌ల్సొచ్చాయి. 2009 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర విజ‌యం క‌ష్ట‌మ‌ని భావించినా, ఆయ‌న 2168 ఓట్ల‌తో నెగ్గుకొచ్చారు. ఇక 2014లో మోడీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ అంశాలతో పాటు సొంత బలంతో 7761 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

మొద‌ట్లో పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ సామాజిక ఓట్లు బ‌లంగా ఉండేవి. ఇది న‌రేంద్ర‌కు ప్ల‌స్ పాయింట్ అయింది. కానీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత కాపు సామాజ‌కివ‌ర్గ ఓట్లు బ‌లంగా మారాయి. పొన్నూరు, చేబ్రోలు, పెద‌కాకాని మండ‌లాలు ఉన్న పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని ప్ర‌ధాన కులాల ఓట్లు పార్టీల‌కు కీలంగా మారాయి. 

ఇక ఈ ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి వైసీపీ అభ్య‌ర్ధిగా రావి వెంక‌ట ర‌మ‌ణ పేరు వినిపించింది. అయితే చివ‌రి నిమిషంలో కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన కిలారు రోశ‌య్య‌కు వైసీపీ టిక్కెట్ ద‌క్క‌డంతో పోటీ తీవ్ర‌మైంది. ఎందుకంటే 40 వేల‌కు పైగా ఉన్న కాపు ఓటర్లు ఈసారి కిలారు రోశ‌య్య‌కు వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితులు, పొన్నూరు పట్ట‌ణంలోని ముస్లింలు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపార‌ని తెలుస్తోంది. ఇక క‌మ్మ సామాజిక వ‌ర్గం న‌రేంద్ర‌కు క‌ల్సొచ్చినా, బీసీ ఓటర్లు టీడీపీ, వైసీపీల మ‌ధ్య చీలిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది న‌రేంద్ర‌కి ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సామాజిక స‌మీక‌ర‌ణాలు ఎలా ఉన్నా, గెలిచే అభ్య‌ర్థి త‌క్కువ మెజార్టీతోనే బ‌య‌ట‌ప‌డ‌తార‌ని స్ప‌ష్టం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle