newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

ద‌గ్గ‌ర‌య్యేందుకా..? దూరం చేయ‌డానికా..?

16-11-201916-11-2019 13:29:50 IST
Updated On 16-11-2019 14:39:36 ISTUpdated On 16-11-20192019-11-16T07:59:50.956Z16-11-2019 2019-11-16T07:59:49.032Z - 2019-11-16T09:09:36.465Z - 16-11-2019

ద‌గ్గ‌ర‌య్యేందుకా..? దూరం చేయ‌డానికా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయంగా కొత్త చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. నిన్న ఉద‌యం గుంటూరులో ఓ పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు.

వాస్త‌వానికి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబంధించి ఆయ‌న కార్య‌క్ర‌మాల‌ను, షెడ్యూల్‌ను పార్టీ ముందుగానే వెల్ల‌డిస్తుంది. కానీ, ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న గురించి మాత్రం ఏ విష‌యాన్ని చెప్ప‌లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి ఢిల్లీ వెళ్లార‌ని చెబుతున్నా ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక రాజ‌కీయ ఉద్దేశ్యాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర పెద్ద‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం కానున్నార‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌స్తుత ప‌రిణామాలు, రాష్ట్ర ప్ర‌భుత్వ తీరు, ఇసుక స‌మ‌స్య‌, పోల‌వ‌రం, రాజ‌ధాని వ్య‌వ‌హారాల్లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డానికి ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆయ‌న హోంమంత్రి అమిత్ షాను క‌లుస్తార‌ని, అవ‌కాశం దొరికితే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సైతం క‌లిసి మాట్లాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో బీజేపీ ప‌ట్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సానుకూలంగా మాట్లాడుతుండ‌టంతో ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

2014 ఎన్నిక‌ల్లో మోడీతో క‌లిసి వేదిక‌ను పంచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల ముందు బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కానీ, ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ప‌ట్ల ఆయ‌న వైఖ‌రి మారింది. బీజేపీ పెద్ద‌ల‌కు త‌నంటే ఇష్ట‌మ‌ని, త‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు బాగా తెలుస‌ని ప‌లుమార్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. జ‌గ‌న్ స‌ర్కార్‌పై వారికి ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చ‌రించారు. బీజేపీకి జ‌గ‌న్ భ‌య‌ప‌డ‌తార‌నే భావ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో ఉన్న‌ట్లు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఇక‌, మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బీజేపీ వైపు లాక్కోవాల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి ఛ‌రిష్మా ఉన్న నేత లేని లోటు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తే ఈ లోటును భ‌ర్తీ చెయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న బీజేపీలో ఉంద‌నే ప్ర‌చారం ఉంది.

ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన ప్ర‌వాసాంధ్రుల కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఇందుకు ఈ ప్ర‌చారానికి బ‌లాన్నిచ్చింది.

ఈ ప్ర‌చారాలు ఎలా ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌హ‌స్యంగా ఉంచుతోంది. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయా లేదా జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఫిర్యాదు చేసి వైసీపీని బీజేపీకి మ‌రింత దూరం చేసే ప్ర‌య‌త్నాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle