newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ద‌గ్గుబాటి వారు డిసైడ్ అయ్యార‌ట‌..!

29-10-201929-10-2019 07:28:51 IST
Updated On 29-10-2019 16:16:57 ISTUpdated On 29-10-20192019-10-29T01:58:51.505Z29-10-2019 2019-10-29T01:58:47.415Z - 2019-10-29T10:46:57.992Z - 29-10-2019

ద‌గ్గుబాటి వారు డిసైడ్ అయ్యార‌ట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ పార్టీలో ఉండాల‌నే డైల‌మాకు చెక్ పెట్ట‌బోతోంది ద‌గ్గుబాటి కుటుంబం. భ‌విష్య‌త్ రాజ‌కీయాల దృష్ట్యా భార‌తీయ జ‌న‌తా పార్టీలోనే ఉండాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్ త్వ‌ర‌లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు వైసీపీ పెద్ద‌ల‌కు కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.గ‌త ఎన్నిక‌ల ముందు వెంక‌టేశ్వ‌ర‌రావు, హితేష్ అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి మాత్రం బీజేపీలోనే కొన‌సాగారు.

హితేష్‌ను వారి స్వంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్చూరు నుంచి పోటీ చేయించాల‌ని వెంక‌టేశ్వ‌ర‌రావు భావించారు. కానీ, పౌర‌స‌త్వ వివాదం ఉండ‌టంతో చివ‌రి నిమిషంలో వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. పురందేశ్వ‌రి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడారు.

ఓడిన త‌ర్వాత కూడా బీజేపీలో కొన‌సాగుతున్నారు పురందేశ్వ‌రి. మ‌హిళా మోర్చా క‌న్వీన‌ర్ హోదాలో ఏపీ బీజేపీలో కీల‌క నాయకురాలిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ స్టాండ్ మేరకు జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు యాక్టీవ్‌గా లేక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి.

దీంతో కుటుంబ‌మంతా ఒకే పార్టీలో ఉండాల‌ని, అది బీజేపీనో, వైసీపీనో తేల్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు స్ప‌ష్టం చేశారు. పురందేశ్వ‌రిని రాజ్య‌స‌భ‌కు పంపిస్తామ‌ని ఆయ‌న ఆఫ‌ర్ ఇచ్చారు.

ద‌గ్గుబాటి రాక‌తో వైసీపీని వీడి టీడీపీలో చేరిన నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఇంఛార్జి రావి రామ‌నాథంబాబును తిరిగి పార్టీలో చేర్చుకున్నారు జ‌గ‌న్‌. త‌న‌ను క‌నీసం సంప్ర‌దించ‌కుండా రావిని పార్టీలోకి చేర్చుకోవ‌డం ప‌ట్ల ద‌గ్గుబాటి అసంతృప్తికి లోన‌య్యారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న అనుచరులు, కుటుంబ‌స‌భ్యుల‌తో ప‌లుమార్లు స‌మావేశ‌మై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. పురందేశ్వ‌రి బీజేపీలోనే కొన‌సాగాల‌ని, తానే రాజకీయాల నుంచి వైదొల‌గాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డికి కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. నేడోరేపో వెంక‌టేశ్వ‌ర‌రావు, హితేష్ వైసీపీకి రాజీనామా చేయ‌నున్నారు.

కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి ప్రాతినిథ్యం లేదు. దీంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే ఏపీ నుంచి ఒక‌రిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది. గ‌తంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌టం, ఎన్టీఆర్ కూతురు కావ‌డం, వంటి వివిధ అంశాలు క‌లిసివ‌స్తే పురందేశ్వ‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ద‌గ్గుబాటి కుటుంబం భావిస్తోంది. అందుకే వైసీపీ కంటే బీజేపీలో ఉండ‌ట‌మే మేల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle