newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

19-10-201919-10-2019 09:53:28 IST
2019-10-19T04:23:28.430Z19-10-2019 2019-10-19T04:23:03.532Z - - 16-11-2019

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక స్పష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల ముందు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌ను జ‌గ‌న్ పార్టీలో చేర్చుకున్నారు.

అంత‌కాలం పార్టీ ఇంఛార్జిగా ఉండి, టిక్కెట్ త‌న‌కే అని ధీమాగా ఉన్న రామ‌నాథం బాబును ప‌క్క‌న పెట్టి మ‌రీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ప‌ర్చూరు టిక్కెట్ ఇచ్చారు.

అయితే, ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ నియోజ‌కవ‌ర్గంలో యాక్టీవ్‌గా లేరు.

ఓ వైపు చీరాల‌లో ఓడినా అన‌ధికారంగా ఎమ్మెల్యే స్థాయిలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చ‌క్రం తిప్పుతున్నారు. రాష్ట్ర‌మంతా ఓడిన వైసీపీ అభ్య‌ర్థులు బాగా యాక్టీవ్‌గానే ఉన్నారు. కానీ, ద‌గ్గుబాటి వారు మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌డం లేదు.

దీనికి తోడు ఆయ‌న స‌తీమ‌ణి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీ నాయ‌కురాలిగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మ‌రింత హ‌ర్ట్ అయ్యారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ ఇంఛార్జి రామ‌నాథం బాబును తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇక‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ఇంఛార్జి ప‌ద‌వి నుంచి సైతం త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో ద‌గ్గుబాటి అనుచ‌రులు, ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌లు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని క‌లిశారు. ద‌గ్గుబాటిని ఇంఛార్జి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌వ‌ద్ద‌ని కోరారు. వీరికి బాలినేని ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం ప‌ట్ల ఆయ‌న అసంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న బాలినేని చెప్పార‌ట‌.

అందుకే పురందేశ్వ‌రిని కూడా వైసీపీలోకి రావాల‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఆమె పార్టీలోకి వ‌స్తే రాజ్య‌స‌భకు పంపించేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు బాలినేని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కైతే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంఛార్జిగా కొన‌సాగుతార‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

మ‌రి, పురందేశ్వ‌రి జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను అంగీక‌రించి కుటుంబమంతా ఒకే పార్టీలో ఉంటారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ఆమె బీజేపీలో ఉండి, వెంక‌టేశ్వ‌ర‌రావు నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టీవ్‌గా లేక‌పోతే మాత్రం ప‌ర్చూలో ఆయ‌న స్థానంలో రామ‌నాథం బాబును ఇంఛార్జిగా నియ‌మించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle