newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ద‌గ్గుబాటి ఇక దూర‌మైన‌ట్లే..!

27-09-201927-09-2019 15:50:12 IST
Updated On 27-09-2019 16:18:07 ISTUpdated On 27-09-20192019-09-27T10:20:12.113Z27-09-2019 2019-09-27T10:20:08.707Z - 2019-09-27T10:48:07.138Z - 27-09-2019

ద‌గ్గుబాటి ఇక దూర‌మైన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియ‌ర్ నేత ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావు ఇప్పుడు పార్టీకి దూర‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీలో యాక్టీవ్‌గా లేని ఆయ‌న స్థానంలో వైసీపీ ప్ర‌త్యామ్నాయాన్ని త‌యారు చేసుకుంటోంది. గ‌తంలో వైసీపీలో ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన రావి రామ‌నాథంబాబును తిరిగి పార్టీలో చేర్చుకోవ‌డం ప్ర‌కాశం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ద‌గ్గుబాటి కుటుంబానికి ప్ర‌త్యామ్నాయంగానే ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌ ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరారు. వాస్త‌వానికి వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయ స‌న్యాసం తీసుకొని త‌న కుమారుడిని ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌నుకున్నారు. కానీ, పౌర‌స‌త్వం వివాదం కార‌ణంగా హితేష్‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేయాల్సి వ‌చ్చింది. అప్ప‌టికే రాజ‌కీయాలపై ఆస‌క్తి లేని ఆయ‌న పెద్ద‌గా ప్ర‌చారం కూడా చేయ‌లేదు. ఆయ‌న త‌ర‌పున చెంచురామ్ ప్ర‌చారం చేశారు. ఎన్నిక‌ల్లో వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌ల్ప తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

అప్ప‌టి నుంచి పార్టీలో, నియోజ‌క‌వ‌ర్గంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ అందుబాటులో ఉండ‌టం లేదు. దీంతో ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ శ్రేణుల‌కు పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది. ఇక‌, భ‌ర్త‌, కుమారుడు వైసీపీలో చేరినా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీలోనే కొన‌సాగుతున్నారు. ఆమె బీజేపీ నుంచి విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసి ఓడారు.

ఇటీవ‌ల పార్టీ ఆదేశాల మేర‌కు వైసీపీ ప్ర‌భుత్వంపై పురందేశ్వ‌రి తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు వెంక‌టేశ్వ‌ర‌రావు, చెంచురామ్ పార్టీలో క్రియాశీల‌కంగా లేరు. వీట‌న్నింటినీ గ‌మ‌నించిన వైసీపీ అధిష్ఠానం వీరి కుటుంబం విష‌యంలో రాజ‌కీయ వ్యూహాన్ని మార్చుకుంది. ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గానికి ద‌గ్గుబాటి చేరిక వ‌ర‌కు ఇంఛార్జిగా ఉన్న రావి రామ‌నాథంబాబును తిరిగి పార్టీలో చేర్చుకుంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ చేరిక కార్య‌క్ర‌మంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ నందిగం సురేష్ పాల్గొన‌గా ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, చెంచురామ్ మాత్రం పాల్గొన‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ముఖ్య నేత‌లంతా పాల్గొన్నారు. దీంతో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, చెంచురామ్ వైసీపీకి దూర‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ విష‌య‌మై పార్టీ కానీ, ద‌గ్గుబాటి కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle