newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

దోమలపై యుద్ధం చేయాల్సిందే...!

15-09-201915-09-2019 17:07:48 IST
2019-09-15T11:37:48.189Z15-09-2019 2019-09-15T11:37:31.886Z - - 05-08-2020

దోమలపై యుద్ధం చేయాల్సిందే...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం ప్రభుత్వం దోమలపై యుద్ధాన్ని ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్న దోమలను నిర్మూలించడమే ధ్యేయంగా గ్రామగ్రామాన దోమలపై యుద్ధం ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారమూ చేసింది. అయితే దోమలపై యుద్ధమా అంటే విపక్షంతో ఎద్దేవా చేసింది. విమర్శలు గుప్పించింది. ప్రజాధనాన్ని దోమలపై యుద్ధం అంటూ వ్యర్థం చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. 

నాడు తెలుగుదేశం ప్రభుత్వం దోమలపై చేసిన యుద్ధంలో విజయం సాధించిందో లేదో పక్కన పెడితే ప్రజారోగ్యం లక్ష్యంగా ఒక ప్రయత్నమైతే చేసింది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలకు, జ్వరాలకు దోమలే కారణమన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గల్లీలో ప్రాక్టీస్ చేసే డాక్టర్ వరకూ అందరూ చెబుతారు.

దోమల వల్ల జర్వాలు వ్యాప్తి చేందుతాయన్నది నిర్ధారణ అయిన విషయం. మరి అటువంటి దోమల నిర్మూళనకు పకడ్బందీ కార్యాచరణ  అవసరం. అందుకోసం ప్రజలను భాగస్వాములను చేయాలంటే దోమల నిర్మూలన విషయంలో పెద్ద ఎత్తున ప్రచారమూ అవసరం. అలాగే దోమల నిర్మూలకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం కూడా అంతే అవసరం. 

పరిసరాల పారిశుద్ధం, నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం దగ్గర నుంచి దోమల మందు జల్లడం, డ్రైనేజీలు, కాలువలు, గార్బేజీల వద్ద దోమల నిర్మూలనకు మందు పిచికారీ చేయడం వంటి పనులన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలి. ఎక్కడా అలసత్వం ఉండకూడదు. అయితే ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పుడు ఏ నగరం చూసినా, పట్టణం చూసినా, పల్లె చూసినా జ్వరాలే. ఊళ్లకు ఊళ్లు జ్వరాల బారిన పడిన దృశ్యాలే.

ఇందుకు కారణం పట్టణాల్లో, పల్లెల్లో, నగరాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ కొరవడటమే. ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల విజృభణను అరికట్టాల్సిన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలు...మొద్దు నిద్ర నటిస్తున్నాయి. హరితహారం, స్వచ్ఛ డ్రైవ్ లతో బిజీగా ఉన్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా అపారిశుద్ధ్య పరిస్థితులు నెలకొని దోమల విజృభణకు కారణమౌతున్నాయి.  

ప్రజాభాగస్వామ్యం కొరవడిన పారిశుద్ధ్య కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.   దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. దోమలపై యుద్ధం ప్రకటించాలి. దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలపై, పరిసరాల పారిశుద్ధ్యంపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు...దోమలను నిర్మూలించేందుకు కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయతీలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. దోమలపై యుద్ధంలో విజయం సాధిస్తేనే...ప్రజారోగ్యం భద్రంగా ఉంటుంది.

Image result for war on mosquitoes in andhrapradesh

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   an hour ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   18 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle