newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

దేశానికి మరో ఎంపీ టాటా... జేసీ గుడ్ బై ?

15-02-201915-02-2019 10:25:37 IST
Updated On 20-02-2019 12:21:15 ISTUpdated On 20-02-20192019-02-15T04:55:37.170Z15-02-2019 2019-02-15T04:55:30.021Z - 2019-02-20T06:51:15.401Z - 20-02-2019

దేశానికి మరో ఎంపీ టాటా... జేసీ గుడ్ బై ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు, సీనియర్ రాజకీయనేత జేసీ దివాకర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అంటే అమరావతి వర్గాల నుంచి అవుననే గట్టిగా సమాధానం వినిపిస్తోంది. ఆయన పార్టీనుంచి రాజీనామా చెయ్యాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు ‘న్యూస్ స్టింగ్’ దగ్గర సమాచారం ఉంది. కొంతకాలంగా ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ తన సన్నిహితులతో చెప్తూ వస్తున్నారు. తన కుమారుడితోబాటు, తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని రావాలన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. 

జేసీ ఇప్పుడు రాజకీయాలనుంచి విరామం ప్రకటించి తన వారసత్వంగా ఆ ఇద్దరికీ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి దింపాలని వ్యూహంతోనే కొంతకాలంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ ఇద్దరినీ అనంతపురం జిల్లాలో వైస్సార్సీపీ నుంచి అసెంబ్లీ బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. 

జేసీ వార్త అమరావతిలో సంచలనం సృష్టించింది. తరచూ తన స్టేట్ మెంట్లతో వార్తల్లో ఉండే జేసీ నిష్క్రమణ తెలుగుదేశానికి కచ్చితంగా పెద్ద దెబ్బే! గత ఎన్నికల్లోనే ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీమీద ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. 

టీడీపీ నేత, ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడుతూ జేసీ నిర్ణయంపై స్పందించారు. ‘‘ఆడవారి మాటలకు అర్థాలే వేరు అంటారు.. కానీ రాజకీయ నేతల మాటలకు అర్థాలే వుండవు. ఆయన నిర్ణయం సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిసినవారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఆ ఇద్దరితో తిరిగిన వారి వారసులకు కూడా అవే లక్షణాలు వంటబడతాయి’’ అని దుయ్యబట్టారు.

ప్రభాకర్ చౌదరికి జేసీకి మధ్య విభేదాలు పొడచూపాయి. గతంలోనే జేసీ వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు ప్రభాకర్ చౌదరి. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడలేదని, గన్ మెన్లు లేకుండా తాను తిరిగేందుకు సిద్ధమని మీరు సిద్ధమా అంటూ గతంలో సవాల్ కూడా విసిరారు. మొత్తం మీద జేసీ వ్యవహారం ఏపీ అంతటా హాట్ టాపిక్ అవుతోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle