newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

దేవుని బిడ్డ జగన్.. భజన ఎక్కువైనట్లుందే!

30-09-201930-09-2019 17:31:35 IST
2019-09-30T12:01:35.563Z30-09-2019 2019-09-30T12:01:09.197Z - - 15-12-2019

దేవుని బిడ్డ జగన్.. భజన ఎక్కువైనట్లుందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేవుడు దయతలచి మన ప్రభుత్వమొస్తే.. దేవుడి ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే.. ఆ దేవుడి ఆశీస్సులతో మీకు అంతా మంచే చేస్తా.. ఇది ఏపీలో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో నిత్యం చెప్పిన మాట. ఇప్పుడెందుకు ఇదంతా అంటారా.. ఈరోజు విజయవాడలో గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు అందించే వేడుక జరిగింది. ఇప్పటి వరకూ వైఎస్ఆర్ కుటుంబసభ్యులుగా ఉన్నవారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. దేవుని బిడ్డ కాబట్టే దేవుడిలా జగన్ ఉద్యోగాలిచ్చారు. కనుక గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ రోజూ జగన్‌ను పూజించాలి. ఈ వ్యాఖ్యలే ఆ వేడుకలో వినిపించాయి.

ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌ కుమార్ గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు అందించే వేడుకలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓ అశోక చక్రవర్తిగా.. అక్కడ ఆ దేవుడి ఆశీర్వదించి ప్రజల కోసం పంపిన బిడ్డగా.. ఇదంతా ఓ స్వర్ణ యుగంగా ఆకాశానికి ఎత్తేశారు. ఇదేదో ఒక్క సీఎం హాజరైన విజయవాడ కార్యక్రమంలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో దాదాపుగా ఇదే స్క్రిప్ట్. దేవుని బిడ్డ కాబట్టే జగన్ అధికారంలోకొచ్చారు. దేవుడు కాబట్టే ఉద్యోగాలిచ్చారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులంతా ఆయన్ను రోజూ దేవుడిలా పూజించాలి. మనమంతా ఓ మంచి మనసున్న మనిషి నీడలో బ్రతుకుతున్నాం!

నిజానికి ఇది ఓ అధికార కార్యక్రమం. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌ కుమార్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వంలోకి రాబోయే ఉద్యోగులకు అది ఆహ్వాన సభ. కానీ ఫక్తు రాజకీయ సభ మాదిరి సాగిపోయింది. అన్ని జిల్లా సభల సంగతెలా ఉన్నా సీఎం భాగమైన విజయవాడ సభలో మాత్రం.. ఎన్నికల మ్యానిఫెస్టోల దగ్గర నుండి కాస్త చరిత్రలోకెళ్ళి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని ఘనకార్యాన్ని మన ముఖ్యమంత్రి చేసి చూపించారని ఉన్నత ఉద్యోగులు చిడతలు కొట్టి మరీ జగన్నామస్మరణ చేశారు. ఎంతలా అంటే.. చివరికి ఆ జన్మోహనుడే కాస్త సిగ్గుమొగ్గలేసేంత.

నిజమే వాళ్లన్నట్లు గ్రామ-వార్డు వాలంటీర్లంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లంతా ఆ పార్టీ కార్యకర్తలే. సాక్షాత్తు ఇది ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఒప్పుకున్న నిజం కూడా. కాబట్టి వాళ్ళు వద్దన్నా కీర్తించడం.. పూజించడం మామూలే. ఇక సచివాలయ ఉద్యోగులు అంటారా చదువుకొని పోటీపరీక్షలో ఉత్తిర్ణులైనవారు. ఇందులో దయలు.. దాక్షిణ్యాలు ఎక్కడున్నాయి.

నిజమే ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలలకే నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం గొప్ప పనే. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన క్రెడిటే. కానీ దేవుని బిడ్డను చేసి చిడతలు కొట్టడం.. దేవుడిలా పూజించాలని ఆదేశించడం మరీ కాస్త ఎబ్బెట్టుగా ఉంది. భజన కాస్త ఎక్కువైనట్లుంది.. కాస్త చూసుకోండి మాస్టారూ!!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle