newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

దేవినేని టెన్షన్ పడుతున్నారా?

18-04-201918-04-2019 09:19:58 IST
Updated On 05-07-2019 16:47:39 ISTUpdated On 05-07-20192019-04-18T03:49:58.226Z18-04-2019 2019-04-18T03:49:07.359Z - 2019-07-05T11:17:39.595Z - 05-07-2019

దేవినేని టెన్షన్ పడుతున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. గత ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చాననీ, అవే తనకు హాట్రిక్ విజయాన్ని అందిస్తాయనీ దేవినేని ధీమాగా ఉన్నార‌ట‌. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గత ఎన్నికల్లో 7 వేల 569 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో మైలవరానికి తాగునీరు కచ్చితంగా అందిస్తానని మాట ఇచ్చిన‌ దేవినేని, పూర్తిస్తాయిలో అమ‌లు చేయ‌లేక పోయార‌ట‌. ఇక సాగర్ కాల్వలు ఉన్నా త‌మ‌కు పూర్తి స్తాయిలో సాగు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. అంతేకాదు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల మీద పెద‌వి విరుస్తున్నారు. 

పారిశ్రామికంగా అభివృద్ధి ఉన్నమైల‌వ‌రం నియోజకవర్గంలో ఉద్యోగాల కల్పన లేద‌నీ, 50 కోట్లతో టూరిజం పార్క్, టీటీడీ ఆలయ నిర్మాణం కోసం వంద కోట్లతో ప్రైవేట్ భూములు కొనాల్సిన అవసరం ఏంటని కూడా జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే మైలవరం పట్టణం నుంచి మురికి నీరు బయటకు పోయేందుకు చేపట్టిన పీతూరు కాల్వ విస్తరణ పనులు అర్థాంతరంగా ఆగిపోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయ‌ట‌. 

ఇక జీ. కొండూరులో టమాట మార్కెట్ యార్డ్ ప‌నులు పూర్తి కాలేద‌ట‌. ఇదంతా ఓ ఎత్త‌యితే వైసీపీ నుంచి మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ బ‌రిలో దిగారు. దీంతో దేవినేనికి గ‌ట్టి పోటీ ఎదురైంది. దేవినేని మీద జ‌నంలో ఉన్న వ్య‌తిరేక‌త‌, జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలే త‌న‌ను గెలిపిస్తాయ‌ని కృష్ణ ప్ర‌సాద్ ధీమాగా ఉన్నారు. 

స్వ‌త‌హాగా వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుటుంబానికి నియోజ‌క‌వర్గంలో ప‌లుకుబడి ఉండ‌టం, జ‌నానికి అందుబాటులో ఉండే ఫ్యామిలీ కావ‌డం ఆయ‌న‌కు క‌ల్సొచ్చే అంశాలుగా మారుతున్నాయ‌ట‌. అంతేకాదు దేవినేని ఉమ సోద‌రుడు దేవినేని చంద్ర‌శేఖ‌ర్ వైసీపీలో చేర‌డం కూడా ఉమ‌కు మైన‌స్ పాయింట్ అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తానికి ఈ ఎన్నిక‌లు అటు దేవినేని, ఇటు వ‌సంత కుటుంబాల‌ను టెన్ష‌న్ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle