newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

దేవినేని ఉమ‌ను వెంటాడుతున్న సెంటిమెంట్..!

19-03-201919-03-2019 07:31:25 IST
2019-03-19T02:01:25.143Z19-03-2019 2019-03-19T02:01:21.001Z - - 28-05-2020

దేవినేని ఉమ‌ను వెంటాడుతున్న సెంటిమెంట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి మైల‌వ‌రం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఈ ప్రభుత్వంలో నీటి పారుద‌ల వంటి కీల‌క శాఖ మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆయ‌న మళ్ళీ విజ‌యం సాధించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రిగా ఐదేళ్లు నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి, టీడీపీ ప్ర‌భుత్వం అమలు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు త‌న‌కు క‌లిసివ‌స్తాయ‌ని ఆయ‌న భావిస్తున్నారు.

అయితే, కృష్ణా జిల్లాకు సంబంధించి ఉన్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం ఆయ‌న‌ను వెంటాడుతోంది. ఒక‌వేళ ఈసారి కూడా ఆ సెంటిమెంట్ నిజ‌మైతే దేవినేని ఉమకు బ్యాడ్ ల‌క్ అనే చెప్పాలి. కృష్ణాజిల్లాలో మంత్రిగా ప‌నిచేసిన నేత‌లు త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌నే సెంటిమెంట్ ఉంది. 

1994 నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ సెంటిమెంట్ కొన‌సాగింది.1989లో మంత్రిగా ప‌నిచేసిన పాల‌డుగు వెంక‌ట్రావు 1994లో నూజివీడులో ఓట‌మిపాల‌య్యారు. ఆయ‌న‌తో పాటే మంత్రిగా ఉన్న పేర్ని కృష్ణ‌మూర్తి కూడా 1994 ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి ఓడిపోయారు. 

1994లో మంత్రిగా ప‌నిచేసిన దేవినేని నెహ్రూ 1999 ఎన్నిక‌ల్లో కంకిపాడు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి నాగేశ్వ‌ర‌రావు చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అదే క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న నెట్టెం ర‌ఘురాం సైతం 1999, 2004 ఎన్నిక‌ల్లో జ‌గ్గ‌య్య‌పేట నుంచి ఓటమిపాల‌య్యారు.

1999లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన వ‌డ్డే శోభ‌నాదీశ్వ‌ర‌రావు, న‌డికుడి న‌ర‌సింహారావు 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2004లో మంత్రిగా ప‌నిచేసిన మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ 2009 ఎన్నిక‌ల్లో అవ‌నిగ‌డ్డ నుంచి ఓడిపోయారు. 

2009లో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన పార్ధ‌సార‌థి సైతం గ‌త ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఇలా కృష్ణ జిల్లా నుంచి మంత్రిగా ప‌నిచేసిన వారు త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఓడిపోతూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగిన సంప్ర‌దాయం ఈ ఎన్నిక‌ల్లో కొన‌సాగుతుందో లేదో చూడాలి.

దేవినేని ఉమ‌కు వైసీపీ అభ్య‌ర్థి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఆయ‌న తండ్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావుకు ఉన్న రాజ‌కీయ అనుభ‌వం, ఈ ప్రాంతంలో ఆయ‌న‌కు మంచి పేరు ఉండ‌టం కృష్ణ‌ప్ర‌సాద్‌కు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది. మ‌రి, దేవినేని ఉమ ఈ సెంటిమెంట్‌‌ను చేధించి మైల‌వ‌రంలో విజ‌యం సాధిస్తారేమో చూడాలి.

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   11 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle