newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

దూసుకొస్తున్న ఫొని ... సిక్కోలుకే ముప్పు!

02-05-201902-05-2019 14:49:09 IST
2019-05-02T09:19:09.676Z02-05-2019 2019-05-02T09:19:05.368Z - - 24-02-2020

దూసుకొస్తున్న ఫొని ... సిక్కోలుకే ముప్పు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మండువేసవిలో ఎండలు ఒకవైపు.. ఫొని తుపాను ముప్పు ఇంకో వైపు ఉత్తరాంధ్ర వాసుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఫొని తుపాను గురు, శుక్రవారాల్లో తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వాధికారులు అప్రమత్తం అయ్యారు. తుపాను వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాపై పడనుంది. దీంతో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఈ తుపాను ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్‌లోని దిగాకు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగా, శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుపాను మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఈశాన్య  దిశలోనే కదులుతూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 

శుక్కవారం మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూరీ సముద్రతీరంలో అలల ఉధృతి పెరిగింది. పూరీ ఆలయానికి వచ్చిన భక్తులను, టూరిస్టులను ఖాళీ చేయించింది. ఫొని తుపానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఒడిశాలోని గంజాం, కుర్దా, పూరీ, జగన్‌సింగ్‌పూర్‌ జిల్లాలో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే అన్ని పోర్టుల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  

మరోవైపు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఫొని తుఫాన్‌పై  మాట్లాడారు. ఒడిషాకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు.. 200 గ్రామాలపై ఫణి తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని సీఎంతో విపత్తుల ప్రత్యేకాధికారి వరప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. 120 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle