newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

దూకుడు పెంచిన సుజనా.. ఈసారి ఆ హోదా ఖాయమేనా?

23-11-201923-11-2019 15:55:32 IST
Updated On 23-11-2019 17:25:27 ISTUpdated On 23-11-20192019-11-23T10:25:32.087Z23-11-2019 2019-11-23T10:25:21.048Z - 2019-11-23T11:55:27.079Z - 23-11-2019

దూకుడు పెంచిన సుజనా.. ఈసారి ఆ హోదా ఖాయమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో బీజేపీ వేగంగా దూసుకొస్తుంది. రెండవ దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు దృష్టిసారించింది. ముఖ్యంగా ఏపీపై గురిపెట్టిన ఆ పార్టీనేతలు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. బీజేపీ దెబ్బను ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఇప్పటికే రుచిచూసింది. ఆ పార్టీ చెందిన నలుగురు ఎంపీలతో పాటు పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సైతం బీజేపీలోకి వెళ్లారు. కాగా సుజనాచౌదరికి ప్రధాని మోదీతో పాటు, అమిత్‌షా, జేపీ నడ్డాలతో మంచి సంబంధాలున్నాయి. దీంతో బీజేపీలోకి వెళ్లిన సుజనాచౌదరి.. ఏపీలో కీలక వ్యక్తిగా మారారు. కేంద్ర పార్టీ పెద్దలుసైతం పలు పార్టీ కార్యక్రమాల నిర్వహణను సుజనాకు అప్పగిస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో ఇతర పార్టీల ముఖ్యనేతలను బీజేపీలో చేర్చే బాధ్యతను అమిత్‌షా సుజానాచౌదరికి అప్పగించినట్లు ప్రచారం సాగుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకెళ్లిన సుజనా.. మరికొందరి ముఖ్యనేతలపై గురిపెట్టినట్లు ప్రచారం సాగుతుంది. ఏపీలోని జిల్లాల్లో కీలకంగా ఉన్న టీడీపీ నేతలపై ఆయన దృష్టిసారించినట్లు తెలిసింది. దీనితో పాటు వైసీపీ నేతలపైనా సుజనాచౌదరి గాలమేస్తున్నట్లు ఏపీలో ప్రచారం సాగుతుంది.

ఇటీవల వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఉత్సకతను ప్రదర్శిస్తున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ విస్తృత ప్రచారం సాగింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ, అమిత్‌షాలతో పాటు కేంద్ర మంత్రులను, ఇతర బీజేపీ ముఖ్యనేతలను కలవాలంటే విజయసాయిరెడ్డిని పక్కన తీసుకెళ్లాలని కుండబద్దలు కొట్టినట్లు ప్రచారం సాగుతుంది. దీనిని బట్టి చూస్తే వైసీపీ ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నట్లు జగన్‌సైతం నమ్ముతున్నట్లు అర్థమైంది.

ఇదే సమయంలో గురువారం సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో పాటు వైసీపీలోని పలువురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే వారు తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలో వారు బీజేపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సుజనాచౌదరి వ్యాఖ్యలతో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీలతోనే సుజనాచౌదరి వ్యాఖ్యలు అర్థరహితమని, సత్యదూరాలని శుక్రవారం చెప్పించారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొనకుండా జగన్‌ ప్రయత్నించారు.

ఇదిలా ఉంటే సుజనాచౌదరి వ్యాఖ్యల వెనుక వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం సుజనాచౌదరికి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని ఆపార్టీ నేతల్లో చర్చ సాగుతుంది. ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలోకి తీసుకురావటంలో ఆయన సఫలీకృతమైనట్లు బీజేపీ పెద్దలుసైతం పేర్కొన్నట్లు ప్రచారంలో ఉంది. గతంలోనే సుజనాకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. ప్రస్తుతం శివసేన నుంచి ఒకరు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఒక పోర్ట్‌ పోలియే ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఈసారైనా కేంద్ర మంత్రిపదవి దక్కించుకోవాలని సుజనా భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

దీనిలో భాగంగా పలువురు టీడీపీ ముఖ్యనేతలను, వైసీపీ ఎంపీలపై సుజనా టార్గెట్‌ పెట్టినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చసాగుతుంది. త్వరలో వారు బీజేపీలో చేరటం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో పాటు రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చడం ద్వారా జాతీయ స్థాయిలో తన పలుకుబడి పెరుగుతుందని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతను కేంద్రం పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యత లను అప్పగిస్తుందని, ఈ నేపథ్యంలో మంత్రి పదవిని అప్పగించే అవకాశం ఉంటుందని సుజనాచౌదరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే సుజనాచౌదరి గురువారం వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు అటు టీడీపీ, ఇటు వైసీపీల్లోని పలువురు నేతలు వ్యాఖ్యానించుకోవటం గమనార్హం. మరి సుజనాచౌదరి వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.  

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle