newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

దుర్గమ్మ చెంత మతమార్పిడి కలకలం... హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం

03-12-201903-12-2019 13:59:05 IST
Updated On 04-12-2019 07:52:59 ISTUpdated On 04-12-20192019-12-03T08:29:05.771Z03-12-2019 2019-12-03T08:08:23.143Z - 2019-12-04T02:22:59.803Z - 04-12-2019

దుర్గమ్మ చెంత మతమార్పిడి కలకలం... హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెజవాడ పేరు చెప్పగానే శ్రీకనకదుర్గమ్మ మదిలో మెదులుతుంది. లక్షలాదిమంది భక్తులు ప్రతిరోజూ పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి దేవస్థానానికి అతి చేరువలో పున్నమి ఘాట్ వుంది. అంతేకాదు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అజమాయిషీ వున్న ప్రాంతంలో మత మార్పిడిలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి కూతవేటు దూరంలోని పున్నమి ఘాట్ లో క్రైస్తవ మత మార్పిడులపై హిందూత్వ వాదులు మండిపడుతున్నారు.

పున్నమి ఘాట్ లో దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమం నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కృష్ణమ్మ సన్నిధిలో లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ మత మార్పిడి తతంగం నిర్వహించారు. అంతా చూస్తుండగానే కార్యక్రమం జరిగింది. పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చికి మేరీమాత విగ్రహాన్ని వేయడంపై హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పవిత్రమయిన ఇంద్రకీలాద్రికి అత్యంత సమీపంలో అన్యమతప్రార్ధనలు జరుగుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక మతానికి చెందిన 47మందిని క్రైస్తవంలోకి మార్చేసినట్టు తెలుస్తోంది. మతమార్పిడిలో భాగంగా వారిని నదిలో ముంచి ప్రార్ధనలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ః

గేట్ నుంచే లోనికి ప్రవేశించిన క్రైస్తవులను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల స్నానఘట్టాలకు అతిచేరువలోనే పున్నమి ఘాట్ ఉండడంతో ఈ మతమార్పిడుల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. 

విజయవాడలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన బైబిల్ కనిపించిందని, జెరూసలెం వెళ్లిరావడం, ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడం అంతా ఒక పద్దతి ప్రకారం సాగుతోందని బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ఈ పరిణామాలు హిందూ సంస్కృతి. సంప్రదాయాలపై దాడి అని ఆయన విమర్శించారు. కృష్ణా గోదావరి సంగమమయిన ఇబ్రహీంపట్నం దగ్గర మతమార్పిడులు జరుగుతున్నాయని ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధికి వివరించారు. 

Image result for లంకా దినకర్"

కేవలం రాజకీయ దురుద్దేశం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా చేస్తున్నారన్నారు దినకర్. దుర్గమ్మ చెంత ఇంత జరుగుతున్నా అక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులే క్రిస్టియానిటీ మీటింగులకు వెళుతున్నారని, వారికి మద్దతు ఇస్తున్నారని దినకర్ అన్నారు. మతమార్పిడి అధికారికం చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎస్సీలు కన్వర్ట్ అయితే బీసీలు అవుతారు. పదవులు అనుభవిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం అది సరైంది కాదు..కన్వర్ట్ అయిన వారిని బీసీలుగా గుర్తించాలన్నారు. మతమార్పిడుల వ్యతిరేక చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని ఆయన కోరారు. మతమార్పిడులు చేసేవారు రాజ్యాంగ హక్కుల్ని కోల్పోయేలా చేయాలన్నారు. ఓటు బ్యాంకు కోసం భారతీయ 

సనాతన సంప్రదాయాలు, మతంపై దాడి చేయడం, రాజకీయ అవసరాల కోసం ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం క్షమించరానిదన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. ప్రభుత్వ పెద్దల భావాలనే నేతలు అనుసరిస్తున్నారని, యథా రాజా తథా క్యాడర్ అయిపోతోందన్నారు దినకర్. 

హిందూ సమాజానికి ఆపద రాబోతోంది: బీజేపీ నేత తాడేపల్లి సత్యమూర్తి 

Image may contain: 1 person, closeup

మెజారిటీ హిందువుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని క్రిస్టియానిటీ వైపు మళ్ళిస్తున్నారని, ఒక ప్రణాళిక తో ఇదంతా చేస్తున్నారని బీజేపీ నేత సత్యమూర్తి మండిపడ్డారు. మెజారిటీ హిందువులు 86 శాతం వున్నారని వారి మెజారిటీ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. హిందువుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను క్రిస్టియన్ ఫాస్టర్లకు జీతాలు ఇస్తున్నారని,  మిషనరీలకు విరాళాలు అందిస్తున్నారని ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు. జెరూసలెం పర్యటనలకు ప్రభుత్వం సాయం చేయడం ఏంటని తాడేపల్లి సత్యమూర్తి ప్రశ్నించారు. 

ఏ దేశంలో కూడా మైనారిటీ కమ్యూనిటీకి మతపరమయిన పర్యటనలకు రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం లేదన్నారు. ప్రధాన రాజకీయపార్టీలు దీనిపై మాట్లాడడం లేదు. సీయం జగన్ నియంతృత్వ పోకడ తో నడుస్తున్నారన్నారు. సీఎం జగన్ తో ఒక్క ఎమ్మెల్యేకి, మంత్రికి అనుసంధానం లేదు. నా వల్ల గెలిచారనే ధోరణి ఆయనలో పెరుగుతోందన్నారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపు వెనుక మతపరమయిన అంశం ఉందని  ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు. హిందూ ధార్మిక సంస్థల కమిటీలలో  60 శాతం రిజర్వేషన్ కల్పించడం తప్పు అన్నారు తాడేపల్లి సత్యమూర్తి. 

రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ శారదాపీఠం స్వరూపనందేంద్ర తీరుని సత్యమూర్తి తప్పుబట్టారు. జగన్ మారిన మనిషి అన్న స్వామీజీ మత మార్పిడి అంశంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హిందువులకు సంబంధించిన స్వామీజీలు, నిర్లిప్తత భయంతో బతుకుతున్నారని, వారి మౌనం వల్ల హిందూ సమాజానికి ఆపద రాబోతోందని సత్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle