newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

దుమ్ముదుమారం- మోడీ-బాబుల 20-20

10-02-201910-02-2019 18:18:34 IST
Updated On 10-02-2019 18:57:50 ISTUpdated On 10-02-20192019-02-10T12:48:34.642Z10-02-2019 2019-02-10T12:15:23.884Z - 2019-02-10T13:27:50.698Z - 10-02-2019

దుమ్ముదుమారం- మోడీ-బాబుల 20-20
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క రోజు కోసం ప్రధాని నరేంద్రమోడీ చేసిన రాష్ట్ర పర్యటన రాజకీయ ప్రకంపనలు పుట్టించింది. చంద్రబాబు వ్యవహారశైలిపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘సన్ రైజ్ రాష్ట్రాన్ని తెస్తానని చెప్పి తన కుమారుడి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. తానూ చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెట్టేటందుకే ఇక్కడకు వచ్చానన్నారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోతానని భయపడుతున్నారు. తన కుమారుణ్ణి అందలం ఎక్కించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా వెన్నుపోటు ముఖ్యమంత్రి అంటూ చేసిన ప్రస్తావన కూడా సంచలనమైంది. తాను ఇవ్వాల్సినదానికంటే రాష్ట్రానికి ఎక్కువే ఇచ్చానంటూ ప్రధాని మోడీ చెప్పారు. అయితే చంద్రబాబుకు లెక్కలు అప్పచెప్పడం రాదంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.  

కొంతకాలం క్రితం ఎర్ర తివాచీలు పరిచి.... పూలు జల్లి స్వాగతించుకున్న ప్రధానికి ఇవ్వాళ చంద్రబాబు ప్రభుత్వం 'గో బ్యాక్ ' చెప్పింది. ప్రధానిని గన్నవరం విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి లేదా ఆయన క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ రాలేదు. ఇదిలావుంటే మోడీ తనను వ్యక్తిగతంగా విమర్శించారని బాబు మండిపడ్డారు. " మీకు కొడుకుల్లేరు..  పెళ్ళాన్ని వదిలేశారు... కుటుంబం అక్కర్లేదు..అనుబంధాలు,ఆత్మీయతలూ అక్కర్లేదు" అంటూ దుయ్యబట్టారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమనీ..ఆయన అటువంటి విమర్శలకు దిగడంవల్లనే తాను సమాధానం ఇవ్వాల్సి వస్తోందని బాబు విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పారు.  

 "మోడీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి  వస్తారంటూ"  పదేపదే చెప్పిన చంద్రబాబు మోడీ పర్యటనను బహిష్కరించారు, పార్టీపరంగా పిలుపునిచ్చారు కూడా ! అందుకు వామపక్షపార్టీలు కూడా సహకరించాయి. అయితే ఎన్నిబేధాభిప్రాయాలున్నా చంద్రబాబు ఒక ప్రధానిని ఎయిర్ పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకోకుండా  ముఖం చాటెయ్యడం సంస్కారవంతంగా లేదన్నది విమర్శ . కొంతమంది సీనియర్  పాత్రికేయులు కూడా సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

నిజానికి ప్రధాని విశాఖపట్నం  వచ్చి చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు . తరవాత  కృష్ణపట్నం పోర్టు దగ్గర టెర్మినల్ ‌ ఆరంభించి అమలాపురం వద్ద ఓఎన్జీసీ సంస్థ ఆన్ షోర్ ప్రాజెక్టును రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. అయితే గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో పూర్తిగా ఎన్నికల ప్రసంగం చేశారు. మొత్తానికి మోడీ రాష్ట్ర పర్యటన ఒక  రాజకీయ దుమారాన్నే లేపింది దానికి వెంటనే విజయవాడలో చంద్రబాబు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మోడీని దుయ్యబట్టడం ఎన్నికల వాతావరణానికి పూర్తిగా తెర లేపినట్లయింది.

‘‘బడుగు, బలహీన వర్గానికి చెందిన ఒక ప్రధాని రాష్ట్రానికి వస్తే టీడీపీ, వామపక్షాలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంద’’ని మండిపడ్డారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి.  ప్రధాని పర్యటన అనంతరం ఆయన ‘న్యూస్ స్టింగ్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అధికారులు పోలీసులతో ఎన్ని కుట్రలు పన్నినా మోడీ సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారని ఆయన అన్నారు.

‘‘చంద్రబాబు, లోకేష్ అవినీతిపై మోడీ చేసిన ప్రసంగానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. కేవలం బీజేపీ-వైసీపీ మధ్య ఏదో సంబంధం ఉందని దుష్ర్పచారం చేయడానికే కొన్ని బ్యానర్లు టీడీపీ శ్రేణులు తయారుచేశాయన్నారు. మోడీ పర్యటన అనంతరం టీడీపీ నేతల్లో ఓడిపోతామనే భయం పెరిగిందన్నారు. ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు దిగడం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం... వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం’’అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. 

మోడీ పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ మండిపడింది. వైసీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి  ‘న్యూస్ స్టింగ్’ తో  మాట్లాడుతూ ...‘‘మోడీ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగం గురించి పదేపదే చెప్పే బాబు ప్రధానికి సంబంధించి ప్రోటోకాల్ పట్టించుకోలేదు. మోడీ గో బ్యాక్ అనడం సరికాదు.

ఒక అసమర్థ నేత రాష్ట్రానికి ఉండడం వల్ల ఏపీ ప్రజలకు ఈ గతి పట్టిందన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి బాబు పట్టించుకోలేదు. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెట్టేశారు. హోదా విషయంలో రోజుకో మాట మాట్లాడే చంద్రబాబుకి ప్రతిపక్ష పార్టీలు ఎలా మద్దతు ఇస్తాయి. బీజేపీ-వైసీపీ రహస్య బంధంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి జనం బుద్ధిచెప్నడం ఖాయం’’ అన్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle