newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

‘దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఇమేజ్ తగ్గుతుందా?’

16-11-201916-11-2019 07:51:10 IST
Updated On 16-11-2019 12:44:52 ISTUpdated On 16-11-20192019-11-16T02:21:10.506Z16-11-2019 2019-11-16T02:21:07.225Z - 2019-11-16T07:14:52.375Z - 16-11-2019

‘దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఇమేజ్ తగ్గుతుందా?’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బెజవాడ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇటు దేవినేని అవినాష్.. అటు వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ తో తెలుగు తమ్ముళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే, చంద్రబాబుకి అత్యంత సహచరుడిగా భావించే వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించడంతో కృష్ణాజిల్లా టీడీపీకీ భారీ కుదుపు తగిలింది.

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై  విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలిసి ఫిర్యాదు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.

తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వంశీ ఆరోపిస్తున్నారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని. అసలు దోషులను శిక్షించాలని పోలీస్ కమిషనర్ ను కోరారు వంశీ. పనిలో పనిగా కొంతమంది టీడీపీ నేతలపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్ సైట్ల నుండి ఈ దుష్ప్రచారం జరుగుతోందని ప్రాథమిక సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు అందజేశారు వంశీ.

తనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టిడిపి నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసన్నారు. తన దిష్టిబొమ్మను దగ్ధం చేసినంత మాత్రాన తన ఇమేజ్ ఏమీ తగ్గదన్నారు వంశీ.  ఎన్నికల సమయాల్లో  సూట్ కేసులు కొట్టేసేవారు తనపై ఆరోపణలు చేస్తున్నారని, వారందరి బండారం త్వరలో బయటపెడతానన్నారు. అంతేకాదు తనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపై కూడా వంశీ స్పందించారు.

గురువారం పరిణామాల అనంతరం వంశీని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు తనను సస్పెండ్‌ చేయడమేంటి? తాను పార్టీకి ఎప్పుడో రాజీనామా చేశా. తాను ప్రజల్లో ఉన్న మనిషినని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో తనకు తెలుసంటున్నారు వంశీ.

ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎవరు చేసినా వారిని సమర్ధించాలని స్వాగతించాలన్నారు. ఎన్నికలు తనకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలని వంశీ సవాల్ విసిరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle