newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

దిశ చట్టం నాతోనే మొదలెట్టండి.. టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన

17-12-201917-12-2019 13:55:17 IST
Updated On 17-12-2019 13:55:15 ISTUpdated On 17-12-20192019-12-17T08:25:17.064Z17-12-2019 2019-12-17T08:23:41.211Z - 2019-12-17T08:25:15.670Z - 17-12-2019

దిశ చట్టం నాతోనే మొదలెట్టండి.. టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో దిశ తరహా ఘటనలు జరిగినప్పుడు కఠిన శిక్షలు విధించేందుకు ఓ చట్టం తెచ్చింది ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఈ చట్టం తెచ్చిన జగన్ సర్కార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తన తోనే దిశ చట్టం మెుదలుపెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో మద్యపాన నిషేధంపై తాను మాట్లాడిన మాటలను కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆమె ప్రశ్నించారు.

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!

అసెంబ్లీలో తాను వివిధ బ్రాండ్ల గురించి మాట్లాడిన మాటలను, తన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వేధింపులకు పాల్పడుతున్నారని భవానీ ఆవేదన చెందారు. అయితే ఈ ట్రోల్స్ ని తాను అంతగా పట్టించుకోనన్నారు. తాను ఒక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఇలాంటి ప్రచారాలకు భయపడనన్నారు. దిశ యాక్ట్ అనేది అసెంబ్లీలో తన నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరడం సంచలనంగా మారింది.

ఒక మహిళా ఎమ్మెల్యేనైన తనను సోషల్ మీడియాలో వేధిస్తే సాధారణ మహిళల పరిస్థితి ఎలా వుంటుందని ఆమె అసెంబ్లీలో వాపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు.

తన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ వేధింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు వున్నాయని, బాధ్యులపై దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ను కోరడం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడి కుమార్తె.  శ్రీకాకుళం తాజా ఎంపీ రామ్మోహననాయుడు సోదరి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle