newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

దిశ చట్టం అమలుకు వడివడిగా అడుగులు...రూ. 87 కోట్ల నిధులు

02-01-202002-01-2020 08:13:40 IST
Updated On 02-01-2020 15:16:07 ISTUpdated On 02-01-20202020-01-02T02:43:40.554Z02-01-2020 2020-01-02T02:43:37.902Z - 2020-01-02T09:46:07.298Z - 02-01-2020

దిశ చట్టం అమలుకు వడివడిగా అడుగులు...రూ. 87 కోట్ల నిధులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు,హత్యలు, వేధింపుల నిరోధానికి ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం, నిందితులకు శిక్షలు అమలవుతాయి. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా తీసుకురావడానికి ముందుకు వచ్చాయి. చట్టం అమలులో అందరికీ ఆదర్శంగా ఉండేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా దిశ చట్టం అమలు కోసం 87 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు.

ఈ చట్టం అమలుకోసం ఎలాంటి ఆర్థికపరమయిన ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్రంలో మహిళా పోలీసుస్టేషన్లలో సౌకర్యాల కల్పన, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల బలోపేతం... ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్‌సెంటర్‌, యాప్‌ల కోసం వీటిని వినియోగించనున్నారు. 

దిశ చట్టం కింద నమోదయిన కేసులు సత్వరం విచారించేందుకు విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్‌ విభాగాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేస్తారు. డయల్‌ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్‌ రూంగా పిలవనున్నారు. 

దిశ యాప్‌ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి బస్‌స్టాప్‌ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. దీని ద్వారా వేధింపులకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేస్తారు. ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసు స్టేషన్‌ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. అలాగే కేసుల సత్వర విచారణకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని నిర్ణయించారు. 

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులకు అవసరమయిన ఆదేశాలు జారీచేస్తున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎం జగన్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle