newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

దివాళా తీసిన వెనిజులాతో ఏపీకి పోలికపెట్టొచ్చా?

10-10-201910-10-2019 12:59:58 IST
Updated On 10-10-2019 14:15:35 ISTUpdated On 10-10-20192019-10-10T07:29:58.331Z10-10-2019 2019-10-10T07:29:52.821Z - 2019-10-10T08:45:35.660Z - 10-10-2019

దివాళా తీసిన వెనిజులాతో ఏపీకి పోలికపెట్టొచ్చా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
1880వ దశకంలో వెనిజులా రిచెస్ట్ కంట్రీలలో ఒకటి. దానికి కారణం ఆ దేశంలో ఉన్న వెయ్యి లక్షల కోట్ల విలువైన చమురు నిక్షేపాలు. అక్కడ బయటపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ వలన ప్రపంచ దేశాలన్నీ అక్కడకు క్యూ కట్టి అక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకొని చమురు వెలికితీత చేస్తుండడంతో ఆ దేశానికి పన్నుల రూపంలో ఎక్కడ లేని ఆదాయం వచ్చి పడింది. ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా జీవితమంతా కష్టపడి చివరికి వెళ్లి వెనిజులాలో సెటిల్ కావాలని అనుకునేంత లగ్జరీ జీవితాన్ని అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు.

అయితే దేశంలో మాత్రం నలభై శాతం మంది పేదరికంలో ఉన్నారు. అది 1990 సంవత్సరం. దేశంలో ఎన్నికల సమయం. హుగో చావిజ్ అనే వ్యక్తి తాము అధికారంలోకి వస్తే పేదలకు అన్నీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే ప్రకటించిన ఫ్రీ బిస్కెట్ పథకం ప్రజలకు చేరువై అయన యునైటెడ్ సోషలిస్టు పార్టీ అఫ్ వెనిజులా అధికారంలోకి వచ్చింది. ఇక అయన చెప్పినట్లుగానే అన్నీ ఉచితంగా ఇచ్చేశాడు. విద్య, వైద్యంతో పాటు ఆహారం, కట్టుకొనే బట్టలు, ఇంట్లోకి కావాల్సిన సకలం ఏదొక ఒక రూపంలో ఉచితంగా ఇచ్చేశాడు. ఉచితంగా ఇవ్వాలంటే ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడాల్సి వస్తుందని అన్నీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు.

సూపర్ మార్కెట్ దగ్గర నుండి పెట్రోల్ పంపులు, వైన్ షాప్స్, మెడికల్ షాప్ వరకు అన్నీ ప్రభుత్వానివే. దీంతో ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ప్రతివ్యక్తికి లాభనష్టం అన్నది తెలియదు.. కేవలం వ్యక్తి 13,000 సగటు ఆదాయం మాత్రమే తెలుసు. వ్యవసాయం, వ్యాపారం లాంటివి చేసే వ్యక్తులు లేకుండా పోయారు. తిండి, బట్ట అన్నీ ఇతర దేశాల నుండి దిగుమతే చేసుకొనేవారు. ఆయిల్ నిక్షేపాల మీద వచ్చే ఆదాయమంతా తినడానికి, లగ్జరీగా బతకడానికి మాత్రమే ఖర్చు పెట్టారు.

చావిజ్ 2013లో మరణించాడు. ఆ తర్వాత నికోలస్ మెడోరా అనే అతను అధ్యక్షుడయ్యాడు. అయన కూడా ప్రజలు అలవాటుపడిపోయిన సంక్షేమాన్ని కొనసాగించాడు. అయితే సరిగా ఏడాదికి ఆయిల్ ధరలు పతనం మొదలైంది. దీంతో ఉద్యోగులకు జీతాలు కష్టమైంది. మరో రెండేళ్లకు అంటే 2016కు.. అంతకు ముందు వంద డాలర్లున్న క్రూడ్ ఆయిల్ ధర ముప్పై డాలర్లకు చేరింది. దీంతో దేశం అతలాకుతమైంది. పనిచేసే మనిషి లేడు. చేయడానికి పనీ లేదు. తినడానికి తిండి లేదు. దిగుమతి చేసుకోడానికి డబ్బులేదు. ఫలితంగా ఓ రొట్టె ముక్క కోసం కూడా చెత్త కుప్ప మీద పడి ప్రజలు తన్నుకొని పరిస్థితికి చేరింది.

అక్కడ నేతలు చేసిన తప్పు ఒక్కటే.. వచ్చే ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే ఐటీ, ఇండస్ట్రియల్ కు కాకుండా ఇన్ఫ్రా స్ట్రక్చర్, సంక్షేమం మీద మాత్రమే ఖర్చు పెట్టారు. ఫలితంగా ప్రజలు సుఖ జీవితం గడిపారు కానీ కష్టాన్ని మర్చిపోయారు. తిరిగి చూస్తే 2016కి దేశంలో ఏ వ్యక్తికి కనీస వసతి లేకుండా పోయింది. ఇది క్లుప్తంగా వెనిజులా దివాళా స్టోరీ. అయితే ఇప్పుడు ఆ దేశానికి మన ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పోలికలు పెడుతున్నారు కొందరు విశ్లేషకులు. ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మసలు కోవాలని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఐదు నెలలు గడిచినా భవిష్యత్ ఆలోచనా సంస్థ ఒక్కటి రాలేదు. ప్రభుత్వం ఒక్క దానికి శంఖుస్థాపన చేయలేదు. రాజధాని మూలాన పడింది. నిర్మాణ రంగం దివాళా తీసింది. ఆదాయపన్నులో దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా ఏకంగా 42 శాతం తగ్గుదలతో రికార్డులు నమోదు చేసింది. ప్రతినెలా జీతాల చెల్లింపు కూడా కష్టమై కేంద్రాన్ని సాయం కోరుతుంది. బ్యాంకులలో రాష్ట్ర పరపతి తగ్గిపోయింది. అంతర్జాతీయ బ్యాంకులు వెనక్కు వెళ్లిపోయాయి.

కానీ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలిస్తున్నారు.. స్వతంత్ర సంస్థలను ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారు. వాళ్లకి జీతాలు ఆలసమవుతున్నా వెనక్కు తగ్గడం లేదు. ఉన్నవి చాలేదని సంక్షేమాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి సంస్థలను వీలైతే ప్రభుత్వ సంస్థలుగా మార్చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రోత్సాహకాలు తగ్గిపోయాయి.. పారిశ్రామికీకరణపై ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా కొందరు విశ్లేషకులు ఏపీలో వెనిజులా పోలికలను వెతుకుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం కక్షసాధింపులు మాని అభివృద్ధి, భవిష్యత్ ప్రాజెక్టులు, రాజధాని, దివాళా తీస్తున్న రంగాలను ఆదుకోకపోతే భవిష్యత్ అంధకారంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి జగన్ సర్కార్ ఏం చేస్తుందో!

 

 

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   7 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   12 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   15 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   16 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle