newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

దిగువన ఉన్న సాగర్ కు కృష్ణమ్మ పరుగులు

10-08-201910-08-2019 15:03:18 IST
Updated On 10-08-2019 15:07:14 ISTUpdated On 10-08-20192019-08-10T09:33:18.274Z10-08-2019 2019-08-10T09:33:11.841Z - 2019-08-10T09:37:14.663Z - 10-08-2019

దిగువన ఉన్న సాగర్ కు కృష్ణమ్మ పరుగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కృష్టమ్మ పరవళ్లు అన్నదాతలో ఆనందోత్సాహాలను నింపుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రవాహం తెలంగాణ ప్రాజెక్టులకు జలకళను సంతరించిపెడుతోంది.  అసలు ప్రాజెక్టులకు నీరొచ్చే అవకాశం ఉందా అని నిన్నమొన్నటి వరకూ నిరాశతో ఉన్న రైతన్న నేడు ప్రాజెక్టులలోని సమృద్ధిగా నీరు చేరి అవి నిండుకుండలను తలపిస్తుండటంతో సాగుకు ఢోకా లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. 

గత నాలుగు రోజులుగా కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్‌ డ్యాం నుండి భారీగా వరదనీరు జూరాలకు చేరుతున్నది. దీనికితోడు నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం వద్ద భీమా నది ఉధృతంగా ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఆల్మట్టి నుంచి, భీమా నది నుండి వచ్చిన కృష్ణమ్మ నీరు జూరాల ప్రాజెక్టులోకి చేరుతుండటంతో  దీంతో జూరాల జలాశయం 40 గేట్లను ఎత్తి సుమారు 5.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

జూరాల ప్రాజెక్టుకు 5.30లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  ఉండగా 5.32 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ నీరు ఉరకలు వేస్తూ శ్రీశైలంకు చేరుతున్నది. దీంతీ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. గత కొన్ని సంవత్సరాల తరువాత శ్రీశైలం నీటికి ఈ స్థాయిలో వరద ప్రవాహం రావడం ఇదే తొలిసారి. శ్రీశైలం నుంచి నీటిని సాగర్ కు విడుదల చేసే కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో శ్రీశైలం గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు  ఈ ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగింది.

దీంతో శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ అయ్యింది   మరోవైపు నాగార్జున సాగర్‌ కు కూడా ప్రవాహ ఉథృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 1.02 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుగులకు గానూ.. ప్రస్తుతం 520.90 అడుగుల నీటిమట్టం నవెూదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4.40 క్యూసెక్కులు కాగా మొత్తం ప్రాజెక్టు 12 గేట్లకు గాను పది గేట్లను ఎత్తి 2.43171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ కు విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ కు కూడా ప్రవాహ ఉధృతి పెరిగింది. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో  1.02 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 6,051 క్యూసెక్కులు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle