newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

దిగజారుడు భాషతో ఏపీలో పొలిటికల్ పొల్యూషన్!

24-11-201924-11-2019 16:24:26 IST
Updated On 24-11-2019 20:08:17 ISTUpdated On 24-11-20192019-11-24T10:54:26.258Z24-11-2019 2019-11-24T10:54:22.797Z - 2019-11-24T14:38:17.636Z - 24-11-2019

దిగజారుడు భాషతో ఏపీలో పొలిటికల్ పొల్యూషన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు సభ్యసమాజంలో సంస్కారవంతులంతా ఛీకొట్టే విధంగా తయారవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు దిగజారుడు భాషతో రాష్ట్రంలో పొలిటికల్ పొల్యూషన్ ను నింపేశారు. రాజకీయాల కోసం నేతలు ఇప్పుడు ప్రజల అవసరాలు, సంక్షేమం, సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ప్రజలకు చులకనైపోతున్నారు.

ఒకప్పుడు రాజకీయాలలో విమర్శ, ప్రతివిమర్శలు కేవలం రాజకీయాల కోసమే ఉండేది. చట్టసభలలో కూడా ఒకరిపై మరొకరు వైఫల్యాలను ఎత్తుచూపడంలోనే పోటీపడేవారు. ఫలితంగా ఆ నేతల సామర్ధ్యం.. సమాజం, ప్రజలు, తమ తమ నియోజకవర్గాలు, రాష్ట్రంలో వాళ్లకున్న పట్టుగా ప్రజలు పేర్కొనేవారు. పార్టీల విషయానికి వచ్చినా వాళ్ళ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలతో విమర్శలుండేవి.

కానీ ఇప్పుడు రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు తరచుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దూషణలు కూడా ఫ్యాషన్ గా మారిపోయాయేమో అనిపిస్తుంది. వాడు.. వీడు అన్న పదాలు అలవోక పలికేస్తున్నారు. ఇక గాడిద.. అడ్డగాడిద.. కొవ్వు పట్టిన గాడిద అన్న పదాలను వింటే ఆ జంతువులు కూడా లాగిపెట్టి తన్నేలా ఉన్నాయి.

ఈ మధ్యనే ఓ మంత్రిగారైతే ఓ ప్రతిపక్ష నేతను కుక్కతో పోల్చడం చూస్తే ఇంతగా దిగజారితేనే ఇప్పుడు రాజకీయం చేస్తారేమో అనిపించకమానదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మన చట్టసభలలో నేతలు ఎంతో హుందా తనంగా ఉండాలని శాసనాలు చెప్తాయి. మన చట్టసభలలో అబద్దం అనే పదం కూడా పలకరాదు. అందుకు బదులుగా సత్యదూరమైన మాటలు అని వాడాల్సి ఉంటుంది. అబద్దం అని పలికితే దానిని రికార్డుల నుండి తొలగించాల్సి ఉంటుంది.

మరి ఇప్పుడు మన నేతలు మాట్లాడుతున్న మాటలు.. ఏపీలో నేతలు మైకుల ముందు టీవీల ముందు కూర్చొని మాట్లాడే బూతులను వింటుంటే ఇదేనా ప్రజాస్వామ్యం?.. వీళ్లా మళ్ళీ ప్రజలకు శ్రీరంగనీతులు చెప్పేది!.. వీళ్లా మనల్ని సంరక్షించేది?.. వీళ్లా చట్టాలు, శాసనాల  గురించి మాట్లాడేది? వీళ్ళనేనా మనం అతి పవిత్రమైన ఓటుహక్కుతో ఎన్నుకొని చట్టసభలకు పంపించేది? అని మన మీద మనకే జాలేస్తుంది.

ఇంకా మాట్లాడుకొంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు కనిపించేది, వినిపించేది మాత్రమే కాదు.. ఇక్కడా.. అక్కడా అనే కాదు రాష్ట్రమంతా అదే పరిస్థితి. చిట్ట చివరి శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు.. చిత్తూరు నుండి బెజవాడ వరకు అంతా అదే పొల్యూషన్. ఏ నాయకుడు ఎంత ఎక్కువగా గొంతు చించుకొని ఎదుటివాళ్ళ మీదకి వెళ్తే అంత గొప్ప లీడర్.. ఎంత ఎక్కువగా బూతులు తిడితే అంత ధైర్యం గల నేత అన్న ఫీలింగ్స్.

ఇక వీటికి మించి దాడులు.. ఎదురుదాడులకు కులసమీకరణాల ఆధారంగా అధిష్టానాలు నేతలను ఉసిగొల్పడం ఇప్పుడు రాజకీయాలలో కీలకంగా మారిపోయింది.  కొన్ని కులాలను టార్గెట్ చేయడమే కలిసి వచ్చే అంశాలుగా మారిపోయిన పరిస్థితులతో విచక్షణ కలిగిన మనుషులు ఈ రాజకీయాలను చీదరించుకుంటున్నారు. పాపం ఇవేమీ తెలియని అమాయక ప్రజలు మాత్రం ఆ పొల్యూషన్లో బ్రతకలేక విలవిలలాడిపోతున్నారు.

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle