newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

‘‘దిగజారిన చంద్రబాబు...భార్యతో సరికొత్త రాజకీయాలా?’’

06-01-202006-01-2020 17:28:12 IST
Updated On 07-01-2020 12:58:00 ISTUpdated On 07-01-20202020-01-06T11:58:12.653Z06-01-2020 2020-01-06T11:58:11.051Z - 2020-01-07T07:28:00.772Z - 07-01-2020

‘‘దిగజారిన చంద్రబాబు...భార్యతో సరికొత్త రాజకీయాలా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో రోజా ఒక సంచలనం. అధికార పార్టీలో ఉన్న రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై అవకాశం చిక్కినప్పుడల్లా మాటల దాడి చేస్తుంటారు. తాజాగా ఆమె చంద్రబాబు అమరావతి పర్యటనలో భార్య భువనేశ్వరిని తీసుకుని రావడంపై విరుచుకుపడ్డారు. తన స్వార్థ రాజకీయాల కోసం భువనేశ్వరిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. నిజమయిన రైతులు అమరావతిలో ఆందోళన చేయడం లేదన్నారు. రైతులపై ప్రేమతో భువనేశ్వరి రెండు బంగారు గాజులు ఇచ్చారంటే నమ్మశక్యంగా లేదన్నారు రోజా. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బినామీలు, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే అమరావతిలో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్టలేదని మండిపడ్డారు. చంద్రబాబు.. ఏడునెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టామని... ఇప్పుడు వారే వైసీపీ ముసుగులో దాడికి ప్రయత్నించారని అన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన దాడిపై రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రోజా హెచ్చరించారు. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle