newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

దావోస్‌కు బాబు డుమ్మా... ఎందుకు?

21-01-201921-01-2019 13:58:32 IST
2019-01-21T08:28:32.862Z21-01-2019 2019-01-21T08:28:29.496Z - - 17-07-2019

దావోస్‌కు బాబు డుమ్మా... ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిసారి దావోస్‌లో జరిగే సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు వేయించుకునే చంద్రబాబు... ఈసారి హాజరు కావడం లేదు. నిజానికి శనివారంనాడు ఆయన దావోస్ పయనం అవ్వాల్సింది. కానీ ఆయన తాను వెళ్ళకుండా తన పుత్రరత్నం, మంత్రి లోకేష్‌ను అక్కడికి సాగనంపారు. పది, పదిహేను రోజుల కిందట ఈ దావోస్ వ్యవహారం వివాదాస్పదమైంది. షరామామూలుగా ముఖ్యమంత్రి బృందం అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే... అక్కడినుంచి బృందంలోని సభ్యుల్ని కుదిస్తూ పర్యటన రోజుల్ని కూడా తగ్గించి కేంద్రం అనుమతినిచ్చింది. దీనిపై నానాయాగి జరిగిపోయింది. ఇదంతా మోదీ చేస్తున్న రాజకీయం అంటూ చంద్రబాబు, లోకేష్‌లతో సహా అందరూ విరుచుకుపడ్డారు. అసలు అనుమతే ఇవ్వలేదంటూ మొదట్లో ప్రచారం జరిగినా... తీరా అనుమతి వచ్చిన తర్వాత బాబు తన దావోస్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ సమావేశం ఒక గొప్ప అవకాశమని ఎప్పుడూ చెప్పే చంద్రబాబు... ఎందుకు తన ప్రయాణం మానుకున్నట్లు? ఎన్నికలు దగ్గర పడ్డాయని, ఈ సమయంలో దావోస్ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడమే కరెక్ట్ అంటూ తన పార్టీ నాయకులు ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు రద్దు నిర్ణయం చేసుకున్నారంటూ వార్తలొచ్చాయి. నిజానికి ఎన్నికల విషయం ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు. 17 మంది సభ్యుల బృందంతో ఐటి మంత్రి లోకేష్ చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా అక్కడికి వెళ్ళడం విశేషం! స్విట్జర్లాండ్ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం ఈనెల 22 నుంచి 25 వరకు జరగనుంది.

మొదట్లో చంద్రబాబు తాను తీసుకెళ్ళిన బృందంలోని సభ్యుల్ని నియంత్రించాలని చెప్పినప్పటికీ... ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పూర్తి డెలిగేషన్‌ని పంపించడానికి కేంద్రం అనుమతినిచ్చింది కూడా! తీరా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళకుండా మిన్నకుండి పోవడం చర్చనీయాంశమైంది. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే విధంగా అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి లోకేష్ పర్యటన సహాయపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం గత గురువారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనతో సరిపెట్టేసింది. ఇక ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా తన పర్యటన రద్దు చేసుకోవడం మరో విశేషం!


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle