newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

దారి త‌ప్పిన ప్రచారం..!

26-03-201926-03-2019 09:12:41 IST
Updated On 26-03-2019 18:58:44 ISTUpdated On 26-03-20192019-03-26T03:42:41.462Z26-03-2019 2019-03-26T03:42:06.380Z - 2019-03-26T13:28:44.427Z - 26-03-2019

దారి త‌ప్పిన ప్రచారం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిక‌ల ప్రచారం పూర్తిగా దారి త‌ప్పింది. ప్రజ‌లకు ఏం చేస్తామో, క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ‌తామో చెప్పాల్సిన పార్టీలు అన‌వ‌స‌ర వివాదాలు, ప‌ర‌స్పర ఆరోప‌ణ‌ల‌తో ప్రచారం చేస్తున్నాయి. వీటి వ‌ల్ల ప్రజ‌ల‌కు ఎటువంటి లాభం లేక‌పోగా ఎన్నిక‌ల్లో వారు ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక‌పోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. కొత్త రాష్ట్రాన్ని అనుభ‌వం ఉన్న నాయ‌కుడు న‌డిపించాల‌ని ప్రజ‌లు చంద్రబాబు నాయుడుకు అవ‌కాశం క‌ల్పించారు.

ఆయ‌న ఐదేళ్లుగా రాష్ట్రాన్ని త‌న శ‌క్తిమేర‌, అనుభ‌వాన్ని ఉప‌యోగించి న‌డిపించారు. ఐదేళ్ల త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక‌ల్లో తాము ఈ ఐదేళ్లు ఏం చేశామో, మ‌ళ్లీ గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పాలి. కానీ, ఆయ‌న వీటి కంటే ఎక్కువ‌గా ఇత‌ర విష‌యాల‌నే ప్రజ‌ల్లోకి తీసుకెళుతున్నారు.

ప‌దే ప‌దే కేసీఆర్ పెత్తనం, వివేకానంద‌రెడ్డి హ‌త్య, జ‌గ‌న్ పై కోడిక‌త్తి దాడి, జ‌గ‌న్ అవినీతి అంటూ ఈ అంశాల‌నే ప్రచార‌స్త్రాలుగా వాడుకుంటున్నారు. వీటిని ప్రచారానికి వాడుకోవ‌డంలో త‌ప్పులేకున్నా త‌న పాల‌న కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం స‌రైంది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. ఐదేళ్లు ప్రతిప‌క్షంలో ఉన్న ఆయ‌న ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాలి. తాను అధికారంలోకి వ‌స్తే ప్రజ‌ల‌కు ఏం చేస్తారో, రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ‌తారో చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రులంతా ఆశ‌గా చూస్తున్న రాజ‌ధాని అమ‌రావ‌తిని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. కానీ, ఆయ‌న ఇంత‌వ‌ర‌కు రాజ‌ధాని విష‌యంలోనే ప్రజ‌ల‌కు క్లారిటీ ఇవ్వడం లేదు.

కేవ‌లం టీడీపీ ఇచ్చిన హామీలు నెర‌వేర్చలేద‌ని, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని, హ‌త్యా రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆరోపిస్తూ టీడీపీపై ప్రతివిమ‌ర్శల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. తాను చేప‌ట్టబోయే న‌వ‌ర‌త్నాల గురించి చెబుతున్నా వాటి కంటే ఆరోప‌ణ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌నే వాద‌న కొంత మంది ప్రజ‌ల్లో ఉంది. ఈ వాద‌న‌ను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర అభివృద్ధిపై త‌న విజ‌న్ ఏంటో, చంద్రబాబు కంటే తాను ఎందుకు బెట‌ర్ అనేది, ఎలా అభివృద్ధి చేయ‌గ‌ల‌నో మాత్రం చెప్పుకోలేక‌పోతున్నారు.

ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వీరిద్దరికీ మినహాయింపు ఏమీ కాదు. త‌న మేనిఫెస్టోను ప్రచారం చేసుకుంటున్నా ఎక్కువ‌గా చంద్రబాబు బాట‌లోనే వెళుతున్నారు. పోలీస్ విచార‌ణ జ‌రుగుతున్న వివేకానంద‌రెడ్డి హ‌త్య, కేసీఆర్ పెత్తనం అంటూ చంద్రబాబు ఆరోప‌ణ‌లే చేస్తున్నారు. ఫ్యాక్షనిస్టుల ఆట క‌ట్టిస్తా, తాట తీస్తా, గుండాల‌ను త‌రిమేస్తా అంటూ ఆయ‌న ప్రచారం చేస్తున్నారు కానీ రాజ‌ధాని, రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రం త‌న ఆలోచ‌న‌లు చెప్పడం లేదు. ఇలా, మూడు ప్రధాన పార్టీలూ ప‌నికిరాని విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శల‌కు ఎక్కువ స‌మ‌యం, ప్రచారం కేటాయిస్తూ పూర్తిగా ఎన్నిక‌ల ప్రచారాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించాయి. రాష్ట్ర అభివృద్ధి, భ‌విష్యత్ గురించి ఆలోచించి ఓట్లేయాల్సిన ప్రజ‌ల‌ను సైతం అవ‌న‌స‌ర వాద‌న‌ల‌తో త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle