newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

దగ్గుబాటి కండిషన్స్ అప్లై.. పొమ్మనలేక పొగబెట్టుడేనా?

12-10-201912-10-2019 12:45:03 IST
2019-10-12T07:15:03.405Z12-10-2019 2019-10-12T07:14:37.265Z - - 06-12-2019

దగ్గుబాటి కండిషన్స్ అప్లై.. పొమ్మనలేక పొగబెట్టుడేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పురంధేశ్వరి.. ఈ పేర్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా లెజెండ్.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో ఢిల్లీలో తెలుగు వాడి సత్తా చాటి నందమూరి అనే ఓ బ్రాండ్ ను నెలకొల్పిన ఎన్టీఆర్ కుమార్తె, ఆయనకు రెండో అల్లుడు, ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుకి స్వయానా తోడల్లుడన్న సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీలో తొలి సంక్షోభం నుండి పార్టీ చేతులు మారే వరకు ఆ పార్టీలో వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారు. ఆనాడు ఎన్టీఆర్-చంద్రబాబులో ఎవరికి దగ్గుబాటి పక్షపాతం అంటే చరిత్రలో రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి.

కారణాలేమైనా కానీ టీడీపీలో ఈ డాక్టర్ వైద్యం పనిచేయక తెగదెంపులు చేసుకున్నారు. మొత్తంగా దగ్గుబాటి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ప్రస్తుతం ఏపీలో అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలలో ఈ కుటుంబం రాజకీయ ప్రస్తానం ఉంది. వెంకటేశ్వరరావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ ఉభయ సభలలో కూడా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయితే రాష్ట్రంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2014 ఎన్నికలకు అయన దూరంగా ఉండి పోయారు.

పురంధేశ్వరి మాత్రం బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు వెంకటేశ్వరరావు మరోసారి యాక్టివ్ రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది. ముందుగా 2019 ఎన్నికలలో కుమారుడు హితేష్ చెంచురామ్ ను రాజకీయలకు పరిచయాలనుకున్నారు. అయితే అన్ని పార్టీలను బేరీజు వేసుకొని వైసీపీలో చేర్పించారు. ఆ సమయంలో వైసీపీ కూడా సాదరంగా ఆహ్వానం పలికింది.

ఎన్టీఆర్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తులు, పైగా సుదీర్ఘ రాజకీయ కుటుంబం. తనకు కలిసివస్తుందనే ఆశతోనే జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పారు. అయితే టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వలన కుమారుడిని తప్పించి వెంకటేశ్వరావు పోటీకి దిగాల్సి వచ్చింది. కానీ ఫలితాలు మాత్రం ప్రతికూలంగా వచ్చాయి. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచినా పర్చూరులో మాత్రం హవా పనిచేయకపోవడంతో దగ్గుబాటి ఓటమి చెందారు.

కాగా ఇప్పుడు వైసీపీలో ఆయనకు కండిషన్స్ పెడుతున్నట్లుగా గత వారం రోజుల నుండి ఏపీ పాలిటిక్స్ లో తెగ ప్రచారం జరిగిపోతుంది. ఇప్పటికే పర్చూరు వైసీపీకి కొత్త ఇంచార్జిని (ఎన్నికలకు ముందు వ్యక్తే) తీసుకొచ్చేశారు. త్వరలో ఆయనకే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించనున్నారు. వైసీపీలో కీలకంగా ఉండాలంటే ముందుగా కుటుంబమంతా తమ పార్టీలోకి వస్తే మంచి ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ అధిష్టానం దగ్గుబాటికి సమాచారం ఇచ్చినట్లుగా కథనాలొచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు భార్యాభర్తలు ఒకే పార్టీలో ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా అన్న వైసీపీ అధిష్టానం ఇప్పుడెందుకు కొర్రీలు పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికలకు ముందు ఆ పార్టీ రాజకీయ సమీకరణాలను లెక్కించి పార్టీలోకి ఆహ్వానిస్తే ఇప్పుడు ప్రభుత్వానికి తెస్తున్న చిక్కులతో పొమ్మనలేక పొగబెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. అవకాశం దొరికితే ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ జగన్ సర్కారును ఎండగట్టేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే పోలవరంను స్వయంగా వెళ్లి సందర్శించిన బీజేపీ బృందం కేంద్రానికి నివేదికలను ఇవ్వనుంది. ఇసుక కొరత నుండి రాష్ట్రంలో రీటెండరింగ్-రిజర్వ్ టెండరింగ్ వరకు రాష్ట్ర బీజేపీ సమరానికి సిద్ధమవుతుంది.

ఈక్రమంలోనే వైసీపీ అధిష్టానం దగ్గుబాటి కుటుంబానికి మెలికలు పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు ఆ కుటుంబం వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో హితేష్ కు భవిష్యత్, తమ పార్టీలో ప్రాధాన్యత కావాలంటే పురంధేశ్వరిని పార్టీలోకి తీసుకురావాలని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు. అదే జరిగితే కొంతమేర బీజేపీ నుండి ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయని వారి ఆలోచన కావచ్చు. ఈక్రమంలోనే దగ్గుబాటికి పొగబెడుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి పురంధేశ్వరి బీజేపీని వదులుకుంటారా? కుమారుడి కోసం త్యాగం చేస్తారా? అన్నీ చేసినా వైసీపీలో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతుందని నమ్మకం ఉంటుందా? దగ్గుబాటి నిర్ణయం ఎలా ఉండబోతుంది? అన్నది ఆసక్తిగా మారింది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle