newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

త‌మ్ముళ్ళు లైట్ తీసుకుంటున్నారా..?

14-08-201914-08-2019 09:21:09 IST
Updated On 14-08-2019 18:18:32 ISTUpdated On 14-08-20192019-08-14T03:51:09.732Z14-08-2019 2019-08-14T03:51:02.354Z - 2019-08-14T12:48:32.128Z - 14-08-2019

త‌మ్ముళ్ళు లైట్ తీసుకుంటున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక ఎన్నిక తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితిని పూర్తిగా మార్చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరుగా చెప్పుకునే టీడీపీలో ఇప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణ కొర‌వ‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ పార్టీలో అధినేత చంద్ర‌బాబు నాయుడు చెప్పిందే ఫైన‌ల్‌. ఆయ‌న మాట‌కు ఎదురు ఉండేది కాదు. ఎవ‌రికైనా వేరే అభిప్రాయాలు ఉన్నా బ‌య‌ట‌కు గ‌ట్టిగా చెప్పే వారు కాదు. ఇక‌, పార్టీ స‌మావేశాలు అంటే నేత‌లంతా ప్ర‌పంచంలో ఏ మూల‌న ఉన్నా వాలిపోయేవారు.

అయితే, ఇప్పుడు సీన్ మారింది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మి త‌ర్వాత తెలుగు త‌మ్ముళ్లు క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీ స‌మావేశాల‌కు నాయ‌కులు అంద‌రూ హాజ‌రు కావ‌డం లేదు. అధినేత మ‌నోగ‌తానికి వ్య‌తిరేకంగా ఆయ‌న ముందే నేత‌లు గ‌ళం విప్పుతున్నారు. పార్టీలో జ‌రిగిన త‌ప్పుల‌ను గ‌ట్టిగానే ఎత్తి చూపుతున్నారు.

తాజాగా, జ‌రిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి స‌మావేశంలో ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యింది. ఈ స‌మావేశానికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు, ప‌య్యావుల కేశ‌వ్‌, నేత‌లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు, జేసీ బ్ర‌ద‌ర్స్ త‌దిత‌ర నేత‌లు డుమ్మా కొట్టారు. వీరిలో కొంద‌రు విదేశాల్లో ఉండ‌గా మ‌రికొంద‌రు రాష్ట్రంలోనే ఉన్నా రాలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, స‌మావేశంలోనూ సీనియ‌ర్ నేత‌లు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, అయ్య‌న్న‌పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. పార్టీలో తెల్ల ఏనుగుల‌ను బ‌య‌ట‌కు పంపాల‌ని, అనేక‌సార్లు ఓడినా ఇంకా అటువంటి వారికి ప్రాధాన్య‌త ఎందుకు ఇస్తున్నార‌ని నేరుగా ప్ర‌శ్నించారు. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించి చేసిన‌వ‌నే చ‌ర్చ శ్రేణుల్లో మొద‌లైంది. పార్టీలో యువ‌త‌కు పెద్ద పీట వేయాల‌ని, బీసీల‌కు ఇచ్చేందుకు త‌న‌కు ఉన్న డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

గ‌త ఐదేళ్లు పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప‌లు త‌ప్పులు చేశార‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఇక‌, మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు కూడా అధినేత మ‌నోగ‌తానికి విరుద్ధంగా మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆరు నెల‌ల పాటు తాము విమ‌ర్శించవ‌ద్ద‌ని మొద‌ట  చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యించారు. కానీ, త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌ది రోజుల నుంచే విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు.

ఇప్పుడు అవి మ‌రింత పెరిగాయి. ఆ పార్టీ యువ నేత నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలోని సోష‌ల్ మీడియా అయితే పెద్ద యుద్ధాన్నే మొద‌లుపెట్టింది. ప్ర‌తీరోజూ టీడీపీ నుంచి ఎవ‌రో ఒక‌రు మీడియా ముందుకువ‌చ్చి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారు. కానీ, అయ్య‌న్న‌పాత్రుడు మాత్రం ఇప్పుడే ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రోడ్డెక్క‌డం స‌రికాద‌ని చంద్రబాబు ముందే చెప్పారు.

ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌నివ్వాల‌ని, ఆ త‌ప్పులు ప్ర‌జ‌ల్లోకి కొంతైనా వెళ్లాక మ‌నం ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని చెప్పారు. ఇది చంద్ర‌బాబు, లోకేష్ ఆలోచ‌న‌ల‌కు విరుద్ధం. అయినా అయ్య‌న్న‌పాత్రుడు ఈ విష‌యాన్ని గ‌ట్టిగానే చెప్పారు. ఇలా అధికారం ఉన్న‌న్ని రోజులూ చంద్రబాబు మాట‌కు, ఆలోచ‌న‌లకు ఎదురుచెప్ప‌ని టీడీపీలో ఇప్పుడు నేత‌లు గ‌ట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే, ఇలా మాట్లాడ‌ట‌మే పార్టీకి మంచిద‌నే అంటున్నారు కొంద‌రు నేత‌లు. వివిధ అంశాల‌పై అంద‌రి అభిప్రాయాలు క‌చ్చితంగా చెబితేనే మంచి నిర్ణ‌యం తీసుకునేందుకు వీల‌వుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి, వీరిపై చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి ఎలా ఉంటుందో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle