newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

త‌న రూటే స‌ప‌రేంటంటున్న టీడీపీ ఎమ్మెల్యే..!

12-11-201912-11-2019 08:10:00 IST
2019-11-12T02:40:00.014Z12-11-2019 2019-11-12T02:39:25.606Z - - 09-12-2019

త‌న రూటే స‌ప‌రేంటంటున్న టీడీపీ ఎమ్మెల్యే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ అర్బ‌న్ టీడీపీకి నాలుగు దిక్కుల్లో న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్న సంగ‌తి తెలిసిందే.  వారిలో ఒక్కొక్క‌రు ఒక్కో దిక్కున‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా..  పార్టీ త‌రుపున ఎలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌న్నా.. ఈ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కుల ఎమ్మెల్యేలు మాత్రం స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ఆ ఒక్క దిక్కున్న ఎమ్మెల్యే మాత్రం త‌న‌రూటే స‌పరేటంటున్నారు. ఆయ‌నే వాసుప‌ల్లి గ‌ణేష్.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అర్బ‌న్ పార్టీని త‌న భుజాన మోసిన ఆయ‌న ఇప్పుడు మాత్రం ప్ర‌త్యేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంలో ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం క‌మ్యూనిటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ టికెట్ ముస్లింల‌కు ఇవ్వాల‌ని రెహ్మాన్ ఆందోళ‌న చేప‌ట్టారు. వాసుప‌ల్లి గ‌నేష్‌కు టికెట్ వ‌ద్ద‌న్నారు.

దీంతో రెహ్మాన్‌ను బుజ్జ‌గించేందుకు అప్ప‌టి వ‌ర‌కు అర్బ‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న వాసుప‌ల్లిని ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. రెహ‌మాన్‌కు అర్బ‌న్ అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి వాసుప‌ల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాన్ని అవ‌మానంగా భావించిన వాసుప‌ల్లి అప్ప‌ట్నుంచి టీడీపీ గ‌డ‌ప తొక్క‌న‌ని శ‌ప‌ధం చేశార‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

తాజాగా, చంద్రబాబు నిర్వ‌హించిన స‌మీక్ష‌కు కూడా వాసుప‌ల్లి రార‌ని అంతా అనుకున్నారు. కానీ, స‌డెన్‌గా వ‌చ్చి క‌నిపించేస‌రికి అంద‌రూ ఖంగుతిన్నారు. ఇక ఆ త‌రువాత నుంచి మ‌ళ్లీ క‌నిపించ‌డం మానేశారు వాసుప‌ల్లి. క‌లిసి ముంద‌కు సాగాల్సిన స‌మ‌యంలో వాసుప‌ల్లి గణేష్ ఇలా స‌ప‌రేట్‌గా న‌డ‌వడంప‌ట్ల కార్య‌క‌ర్త‌లు ముక్కున వేలేసుకుంటున్నారు.

పార్టీతో సంబంధం లేకుండా కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితవ‌డంతో పార్టీ శ్రేణుల్లో వాసుప‌ల్లిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చంద్ర‌బాబు స‌మీక్ష త‌రువాత ఆయ‌న తీరే పూర్తిగా మారిపోయింద‌ని, అర్బ‌న్ అధ్యక్షుడిగా రెహ్మాన్ ఉన్నందున పార్టీ కార్యాల‌యానికి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదట వాసుప‌ల్లి గ‌ణేష్. ఆయ‌న పంతం సంగ‌తేమోకానీ.. పార్టీ భ‌విష్య‌త్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంద‌ని కార్య‌క‌ర్త‌లు చెవులు కొరుక్కుంటున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle