newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

'త్రిమూర్తులు'పై..జగన్‌కు ఎందుకంతప్రేమ..!

26-09-201926-09-2019 11:49:28 IST
Updated On 26-09-2019 13:29:56 ISTUpdated On 26-09-20192019-09-26T06:19:28.914Z26-09-2019 2019-09-26T06:18:59.142Z - 2019-09-26T07:59:56.153Z - 26-09-2019

'త్రిమూర్తులు'పై..జగన్‌కు ఎందుకంతప్రేమ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవల వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు అంటే వైసీపీ అధినేత జగన్‌కు ఎందుకంత ప్రేమ? ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ శ్రేణుల్లో మెదులుతున్న ప్రశ్న ఇదే.. ఈ జిల్లాల్లో వైసీపీకి బలమైన నాయకులున్నా.. ఏరికోరి జగన్‌ త్రిమూర్తులునే ఎందుకు తెచ్చుకున్నట్లు అనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే తోట త్రిముర్తులు చేరిక తూర్పు వైసీపీలో కలకలం రేపింది.. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అయితే త్రిమూర్తులు వైసీపీలో చేరినా ఆయనే నా మొదటి శత్రువు అని కుండబద్దలు కొట్టేశాడు.. మరోవైపు తోట వైసీపీలో చేరికను నిరసిస్తూ రామచంద్రాపురం వైసీపీ క్యాడర్‌ ధర్నాలు చేపట్టింది.. అయినా జగన్‌ ఎక్కడా వెనక్కు తగ్గకుండా తోట త్రిమూర్తులకు వైసీపీ కండువా కప్పేశారు.

తోట త్రిమూర్తులు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో విలక్షణ నాయకుడు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత క్యాడర్‌ కలిగిన నేత. అందుకే ఆయనకోసం ఏ పార్టీ అయినా డోర్లు తెరిచే ఉంచుతాయి. మొన్నటి ఎన్నికల్లో తోట తెదేపా తరపున పోటీ చేశారు. ఎన్నికల ముందే వైసీపీలోకి వెళ్తారని అందరూ భావించినా.. తెదేపా నుంచే తోట పోటీ చేశారు.

కానీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. నిజానికి త్రిమూర్తులు సొంత నియోజకవర్గమైన రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఒక వరలో రెండు కత్తులు అన్న చందంగా తయారైంది. ఇప్పుడు త్రిమూర్తులు అదే వరలో మూడో కత్తిగా మారారనే చర్చ వైసీపీ శ్రేణుల్లో సాగుతుంది..

ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరుపున వేణుగోపాల్‌ కృష్ణ ఎమ్మెల్యేగా నెగ్గారు. అదే నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పక్కనే ఉన్న మండపేటలో పోటీ చేసి ఓడిపోయారు. అయినా జగన్‌ పిల్లికి ఉపముఖ్యమంత్రి హోదాను కట్టబెట్టి గౌరమిచ్చారు. అయితే వేణుగోపాల్‌ కృష్ణ, పిల్లి వర్గీయుల మధ్య విబేధాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తోట త్రిమూర్తులు రాక వీరిద్దరికి పెద్ద తలనొప్పిగా మారినట్లయింది.

ఇదిలా ఉంటే ఎప్పటినుంచో రాజకీయ శత్రువులుగా ఉన్న తోట, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు.. ఒకేతాటిపై నడిచేలా కనిపించటం లేదు. తోటపై బాహాటంగానే పిల్లి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న వేణుగోపాల్‌ మాత్రం కాస్త ముభావంగా ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. తోటతో తనకు ఎప్పటికైనా ముప్పే అని భావిస్తున్న వేణుగోపాల్‌ వర్గం ఆచితూచి మాట్లాడుతున్నట్లు చర్చ సాగుతుంది.

త్రిమూర్తులు చేరికకు వైసీపీ అధిష్టానం ఎంతో ప్రాధాన్యతను ఇవ్వటం గమనార్హం. జగన్‌ తన అధికారిక నివాసంలో త్రిమూర్తులు ప్రత్యర్థులైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను ఒకవైపు, వేణుగోపాల్‌ను ఒకవైపు నిలుపుకొని మరీ త్రిమూర్తులుకు పార్టీ కండువా కప్పారు. త్రిమూర్తులు చేరిక ఇప్పటికి ఉపయోగం లేకపోయినా మున్ముందు కాలంలో పార్టీకి మేలు చేస్తుందని జగన్‌ సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాపుల రిజర్వేషన్‌ల విషయం ఇబ్బంది పెడుతుండగా, మరోవైపు అమలాపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలో భారీ సంఖ్యలో కాపు కులస్తులున్నారు. వీరికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి బలమైన కాపుసామాజిక వర్గ నేత వైసీపీలో లేరు. దీంతో త్రిముర్తులు అయితే పార్టీకి బలం చేకూరడంతో పాటు, బలమైన కాపుసామాజిక వర్గం ఓట్లును మనవైపు మల్లించుకోవచ్చని వైసీపీ వ్యూహాంగా తెలుస్తోంది. దీనికితోడు త్రిమూర్తులకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంచి పట్టుంది. ఈ జిల్లా వైసీపీ పగ్గాలు త్రిమూర్తులుకు ఇస్తే జిల్లాలో వైసీపీ మరింత బలోపేతమవుతుందని వైసీపీ అధినేత జగన్‌ భావించినట్లు తెలుస్తుంది. మరి జగన్‌ భావించినట్లు తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు మల్లుతుందా..? లేదా అనేది వేచి చూడాల్సిందే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle