newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

తోడల్లుడు గేమ్ మొదలెట్టేశాడు

16-02-201916-02-2019 12:59:12 IST
Updated On 20-02-2019 12:09:38 ISTUpdated On 20-02-20192019-02-16T07:29:12.694Z16-02-2019 2019-02-16T07:29:10.684Z - 2019-02-20T06:39:38.427Z - 20-02-2019

తోడల్లుడు గేమ్ మొదలెట్టేశాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబునాయుడు.... ఎన్టీఆర్ అల్లుళ్ళలో వీరే ఫేమస్. అందునా దగ్గుబాటి కంటే చంద్రబాబుని అంతా బాగా గుర్తుంచుకుంటారు. చాలాకాలం పాటు తోడల్లుళ్ళు ఇద్దరూ సఖ్యంగా ఉన్నా... తర్వాత చంద్రబాబు వైఖరితో దగ్గుబాటి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల వేళ దగ్గుబాటి ఫ్యామిలీ చంద్రబాబుకి గుణపాఠం నేర్పేందుకు ఆయన వైరిపక్షంలో చేరిపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు హితేష్ కోసం జగన్ వైపు చేరారు. అయితే పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. 

దగ్గుబాటి వైసీపీలో చేరిన తర్వాత తనకు సన్నిహితులైన టీడీపీ నేతలను వైసీపీ వైపు నడిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీ సీనియర్ నేతలు, గతంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వారు లోటస్ పాండ్ వైపు వెళుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ అంతరంగం వెల్లడిస్తున్నారు. తాజాగా పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్‌ జగన్‌ని కలవడం సంచలనంగా మారింది.

టీడీపీ ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారిపోయిందని, ఇంత వరకూ చూడని అవినీతి ఇప్పుడు ఏపీలో జరుగుతోందని దాసరి జైరమేష్ సంచలన ఆరోపణలు చేయడంతో ఏపీ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్లకు పైనే సంపాదించారన్నారు. ఆ మొత్తం ఇప్పుడు రెండింతలు అయిందన్నారు. 

చంద్రబాబు పాలనలో ఒక సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు జై రమేష్. జగన్‌ ఎన్నికల వాగ్దానాలను పరిశీలిస్తున్నానని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఆయనకు మద్దతునిస్తున్నానని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసే అంశంపై కూడా భేటీ సందర్భంగా చర్చించామని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

దాసరి జైరమేష్, అడుసుమిల్లి జయప్రకాష్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. దాసరి జైరమేష్ సోదరుడు దాసరి బాలవర్థన్‌రావు టీడీపీలో కొనసాగారు. కానీ రమేష్ 2001 నుంచీ దూరంగా ఉన్నారు. 1999లో విజయవాడ లోక్‌సభ, గన్నవరం శాసనసభ స్థానం రెండు సీట్లు ఇస్తామని అంతకు మునుపు వాగ్దానం చేసిన చంద్రబాబు మాట తప్పారు. దాంతో టీడీపీ రాజకీయాల మీద విరక్తి చెంది దూరంగా ఉన్నానన్నారు రమేష్. త్వరలో వైసీపీలో చేరనున్నారు. దగ్గుబాటి గేమ్ స్టార్ట్ చేశారని, చంద్రబాబుకి చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. 

ఇటు ఆళ్లగడ్డ టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్‌ రెడ్డి జగన్‌‌తో భేటీ అయ్యారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అయితే టీడీపీలో తమకు సరైన గౌరవం లేదని, కష్టకాలంలో అండగా నిలిచిన తమకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. త్వరలో వీరంతా వైసీపీలో చేరడం గ్యారంటీ అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మరింతగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వీళ్లిద్దరూ వైసీపీలో చేరతారని అంటున్నారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటును త్యాగం చేస్తే... మాగుంట వైసీపీలోకి చేరడానికి రెడీ అంటున్నారని సమాచారం. జగన్ పార్టీలోకి వలసలు టీడీపీ నేతల్ని కలవరపెడుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle