తొలి ప్రసంగంలోనే చంద్రబాబు ఫెయిల్!
13-06-201913-06-2019 17:48:05 IST
2019-06-13T12:18:05.481Z13-06-2019 2019-06-13T12:18:02.630Z - - 11-12-2019

ఘోర పరాజయం తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి ఎలా వుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి కొత్తగా కొలువుదీరిన శాసనసభలో ఆయన చేసిన తొలి ప్రసంగం నీరుగార్చింది. ‘ఈరోజు నేను కాంట్రవర్శీకి పోదలచుకోలేదు’ అంటూ సభలో హుందాగా స్పందించినప్పటికీ సభలో విపక్ష నేతగా ఆయన చేసిన ప్రసంగం ఆయన సహజశైలికి తగ్గట్టుగా లేదని వ్యాఖ్యానాలు వినిపించాయి. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభకు రెండవ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అభినందిస్తూ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఘన చరిత్రను చాటుకునేందుకు తనకు లభించిన అరుదైన అవకాశాన్ని చంద్రబాబు చేజార్చుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమ్మినేని సీతారాం వంటి ఎంతోమంది బీసీ నేతల ఎదుగుదలకు సోపానంగా నిలిచింది. బీసీ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కీలక శాఖలలో పనిచేశారు. ఆ తరువాత కొద్ది రోజులు ప్రజారాజ్యం పార్టీలో ఉండి, ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు పిలుపుతో తిరిగి టీడీపీలో చేరారు. ఏపీ విభజనపై చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను తప్పుబడుతూ ఆ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అదే రవికుమార్‌పై తమ్మినేని విజయం సాధించి ఇప్పుడు కొత్త సభలో సభాపతిగా ఎంపికయ్యారు. ఇక్కడ రెండు అంశాల్ని చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించాల్సి వుంది. ముఖ్యంగా నూతన సభాపతి రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీయే కారణమని గట్టిగా గుర్తుచేసి వుంటే అది ఆ పార్టీకి లాభించేది. ఇక రెండవది ఏ రాష్ట్ర విభజననైతే సహించలేక తమ్మినేని ఆనాడు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారో ఆ విభజన అంశాన్ని ప్రస్తావించి, ప్రత్యేక హోదా తదితర రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేందుకు దోహదపడేలా కొత్త సభలో అర్ధవంతమైన చర్చలు సాగేందుకు సభాపతి సహకరించాలని చంద్రబాబు కోరి వుంటే అది సమయోచితంగా ఉండేది. అధికార పక్షంపై విసిరేందుకు ముందస్తు అస్త్రంగా ఉపయోగపడేది. ఈ రెండు అంశాల్ని చంద్రబాబు ప్రస్తావించలేకపోయారు. తొలి ప్రసంగమే ఇలా వుండటం మొత్తం మీద ఆ పార్టీ అభిమానులకు నీరసం కలిగించింది.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
9 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
12 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
12 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
13 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
13 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
15 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
15 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
15 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
17 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
18 hours ago
ఇంకా