newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

తొడగొట్టిన మంత్రి అనిల్ .. మండలి చైర్మన్ గడ్డంపై వివాదాస్పద వ్యాఖ్యలు

17-06-202017-06-2020 13:25:38 IST
Updated On 17-06-2020 14:46:36 ISTUpdated On 17-06-20202020-06-17T07:55:38.638Z17-06-2020 2020-06-17T07:55:19.084Z - 2020-06-17T09:16:36.774Z - 17-06-2020

తొడగొట్టిన మంత్రి అనిల్ .. మండలి చైర్మన్ గడ్డంపై వివాదాస్పద వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనమండలి సమావేశాల్లో గందరగోళం చోటుచేసుకుంది. మంత్రి అనిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపించారు. 

మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని అనిల్  ప్రశ్నించారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. మంత్రి అనిల్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మండలిలో మంత్రి అనిల్ లో తొడగొట్టారు. 

తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని మంత్రి అనిల్ అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందని. భాష మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ క్రమంలో గడ్డంపై వ్యాఖ్యలు చేశారు. గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా...? అంటూ  చైర్మన్ షరీఫ్‌ గడ్డంపైనా వ్యాఖ్యలు చేశారు. ఆయన రౌడీనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి గడ్డం ఉందంటే ఆయన రౌడీనా అన్నారు. దీంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇరుపక్షాల వాదనలతో మండలి వేడెక్కింది. దీంతో శాసన మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. 

 

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   6 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle