newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

తొంద‌ర‌పాటుతో ఇరుకునప‌డ్డ తెలుగుదేశం..!

22-07-201922-07-2019 13:01:56 IST
Updated On 23-07-2019 11:37:13 ISTUpdated On 23-07-20192019-07-22T07:31:56.670Z22-07-2019 2019-07-22T07:26:27.993Z - 2019-07-23T06:07:13.409Z - 23-07-2019

తొంద‌ర‌పాటుతో ఇరుకునప‌డ్డ తెలుగుదేశం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ బ్యాంకు తీసుకున్న ఓ నిర్ణయం మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చ‌ర్చనీయాంశ‌మైంది. ముఖ్యంగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి కార‌ణ‌మైంది. ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు గ‌తంలో ముందుకు వ‌చ్చిన ప్రపంచ బ్యాంకు ఇప్పుడు వెన‌క్కు వెళ్లింది.

తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల నుంచి ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్ర‌పంచ బ్యాంకు నిర్ణ‌యాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంది.

ప్రపంచ బ్యాంకు నిర్ణ‌యం ప్రక‌టించ‌గానే వైసీపీపై దాడి మొద‌లుపెట్టింది. జ‌గ‌న్ వ‌ల్లే ప్రపంచ బ్యాంకు వెన‌క్కు వెళ్లింద‌నే ఆరోప‌ణ‌ల‌కు టీడీపీ నేత‌లు దిగారు. జ‌గన్ ముఖ్య‌మంత్రిగా ఉంటే అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని, ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని కేవ‌లం క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.

టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ అయితే.. జ‌గ‌న‌న్న వ‌చ్చారు.. వ‌ర‌ల్డ్ బ్యాంక్ పోయింది. జ‌గ‌న్ క‌ల నెర‌వేరింది. మొత్తానికి అమ‌రావ‌తిని ప‌డ‌గొట్టుశారు అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ప్రజ‌ల్లోనూ ఈ విష‌యం బాగా చ‌ర్చనీయాంశ‌మైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు కూడా ముందు ఈ విషయాన్ని ఎలా కౌంట‌ర్ చేయాలో అర్థం కాలేదు. అస‌లు, ప్ర‌పంచ బ్యాంకు ఎందుకు వెన‌క్కు వెళ్లింద‌నేది ముందు వారికీ అర్థం కాలేదు. అయితే, ఇప్పుడు ప్ర‌పంచ బ్యాంకు అమ‌రావ‌తి ప్రాజెక్టుకు రుణం ఎందుకు ఇవ్వ‌డం లేదో క్లారిటీ ఇచ్చింది.

కేంద్రం లేఖ రాసినందునే తాము అమ‌రావ‌తి నుంచి త‌ప్పుకుంటున్నట్లు ప్రక‌టించింది. అంతేకాదు, అమ‌రావ‌తికి నిరాక‌రించిన సాయం మొత్తానికి మూడింత‌ల సాయాన్ని ఇత‌ర ప్రాజెక్టుల‌కు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నూత‌న ప్రభుత్వానికి త‌మ సంపూర్ణ స‌హ‌కారం ఇస్తామ‌ని స్పష్టం చేసింది. ప్ర‌పంచ బ్యాంకు తాజా ప్రక‌ట‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊర‌ట ఇవ్వగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టింది.

ప్రపంచ బ్యాంకు ఎందుకు రుణాన్ని నిరాక‌రించిందో పూర్తిగా వివ‌రాలు రాక‌ముందే చంద్ర‌బాబు, లోకేష్ స‌హా టీడీపీ నేత‌లు వైసీపీపై విమ‌ర్శలు చేశారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకే తాము అమ‌రావ‌తికి నిరాక‌రించిన రుణ మొత్తానికి మూడింత‌లు ఇత‌ర ప్రాజెక్టుల‌కు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని, జ‌గ‌న్ ప్రభుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డంతో తాము చేసిన విమ‌ర్శ‌ల‌ను ఎలా స‌మ‌ర్థించుకోవాలో టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు.

ప్రతీ అంశంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల‌నే టీడీపీ నేత‌ల ప్రయ‌త్నాలు కొన్నిసార్లు ఫ‌లిస్తున్నా మ‌రికొన్ని సార్లు మాత్రం విక‌టిస్తున్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.. ఇటీవ‌ల టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ ట్వీట్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఓ రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రమాద‌క‌రంగా మారింద‌నేది ఆ ట్వీట్ సారాంశం.

ఈ ట్వీట్‌పై నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శలు వ‌చ్చాయి. ఇంత‌కాలం ప్రభుత్వంలో ఉన్న టీడీపీ రెండు నెల‌ల క్రితం వ‌చ్చిన ప్రభుత్వాన్ని రోడ్లు బాగ‌లేవ‌ని విమ‌ర్శించ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ప్రశ్నల వ‌ర్షం కురిపించారు.

తాజాగా, ప్రపంచ బ్యాంకు వ్య‌వ‌హారంలోనూ టీడీపీ నేత‌లు ఇది తీరును అవ‌లంభించి ఇరుకున ప‌డ్డారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వం త‌ప్పుంటే విమ‌ర్శించ‌డం త‌ప్పు కాదు కానీ ప్ర‌తీ అంశంలోనూ వైసీపీని విమ‌ర్శించాల‌నే ఆలోచ‌న‌ను తెలుగుదేశం వీడితేనే ఆ పార్టీకి మేలు అనే సూచ‌న‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వ‌స్తున్నాయి.

 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle